Begin typing your search above and press return to search.
టైగర్.. ఆ రెండు సీన్లనూ వేస్ట్ చేశాడు!
By: Tupaki Desk | 12 Dec 2015 8:54 AM GMTఒక సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పుడు అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకులు రెట్టింపు గ్లామర్‌ని ఆశిస్తారు. ఇక సినిమాలో తమన్నా, రాశిఖన్నాలాంటి కథానాయికలే ఉన్నారనుకోండి, ఆ అంచనాలు మరింతగా పెరిగిపోతుంటాయి. బెంగాల్ టైగర్ విషయంలో అదే జరిగింది. మిల్కీ, రవితేజతో కలిసి వున్న స్టిల్స్ ఎప్పుడో బయటికొచ్చాయి. ఆ స్టిల్స్ చూసిన ప్రేక్షకులు చాలా ఊహించుకొని థియేటర్‌కి వచ్చారు. దర్శకుడు సంపత్ నంది కూడా ఆ అంచనాల్ని దృష్టిలో ఉంచుకొనే గ్లామర్ హంగుల్ని, రొమాన్స్‌నీ జోడించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సన్నివేశాలపై మరికాస్త దృష్టి పెట్టుంటే రెట్టింపు రొమాన్స్ పండేదని తాజాగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాశిఖన్నాని బికినీ సన్నివేశంలో చూపించడం దగ్గర, తమన్నా తలపై నుంచి నాభిదాకా నీటి బింధువు జారే సన్నివేశం దగ్గర దర్శకుడు తప్పు చేశాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిజానికి ఆ రెండూ మాంచి రొమాంటిక్ సన్నివేశాలు. అయితే అలాంటి సన్నివేశాల్లో ఆపోజిట్‌లో హీరో ఉంటేనే రొమాన్స్, కెమిస్ట్రీ గట్రా బాగా పండుతుంటాయి. అయితే రాశిఖన్నా స్విమ్మింగ్ పూల్ నుంచి బికినీతో బయటికొచ్చేటప్పుడు ఎదురుగా తమన్నా ఉంటుంది. దీంతో ఆ సన్నివేశం వృథా అయిన భావన కలుగుతుంది. అలాగే తమన్నా ఒంటిపై నీటి బింధువు రాలే సన్నివేశంలోనూ రవితేజ ఉండడు. మనోడు ఫోన్లో మాట్లాడుతూ కవ్విస్తుంటాడంతే. ఆ రెండు సన్నివేశాల్లో ఆపోజిట్‌లో హీరోని పెట్టుంటే మాత్రం ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేదని, మాస్‌కి మరింతగా నచ్చేదని ప్రేక్షకులు, సినీ విమర్శకులు మాట్లాడుకుంటుండడం వినిపిస్తోంది