Begin typing your search above and press return to search.

'రొమాంటిక్' రెండో ట్రైలర్: ప్రేమలో ఉంటూ మోహమని భావించే జంట కథ

By:  Tupaki Desk   |   25 Oct 2021 12:08 PM GMT
రొమాంటిక్ రెండో ట్రైలర్: ప్రేమలో ఉంటూ మోహమని భావించే జంట కథ
X
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా రూపొందిన సినిమా ''రొమాంటిక్''. పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ పూరీ అందించారు. ఇందులో ఆకాశ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న భారీ స్థాయిలో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్పెషల్ పోస్టర్స్ - టీజర్ - పాటలు - ట్రైలర్ అంటూ మూవీ పై బజ్ క్రియేట్ చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పాన్ ఇండియా మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ లతో ''రొమాంటిక్'' ప్రమోషన్స్ లో భాగం అవడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలో తాజాగా మరో ట్రైలర్ ను చిత్ర బృందం ఆవిష్కరించారు. కర్లో యా మర్లో అంటూ హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయో తెలియజేసేలా ఈ ట్రైలర్ ని కట్ చేశారు. వయసు మొహం మళ్ళీరావ్ అనుకుంటూ.. ప్రేమలో ఉండి అది మోహమని ఆకర్షణ అని భావించే ఓ జంట కథే ఈ రొమాంటిక్ అని తెలుస్తోంది.

'రొమాంటిక్' చిత్రంలో ప్రతీ పాత్ర కూడా కొత్తగా డిఫెండర్ యాటిట్యూడ్ తో.. డైలాగ్ మాడ్యులేషన్ లో వెరీయేషన్ చూపిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ రోల్ లో కనిపిస్తోంది. హకేతిక తన గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తోంది. ఆకాష్ ఈజ్ తో నటించినట్లు తెలుస్తోంది. మకరంద్ దేశ్ పాండే - ఉత్తేజ్ - సునయన ఇతర పాత్రల్లో కనిపించారు. యూత్ ని ఆకట్టుకునే రొమాన్స్ - యాక్షన్ తో పాటుగా ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా యఉన్నాయని అర్థం అవుతోంది. సినిమా అంతా గోవాలోని అందమైన లొకేషన్స్ లో తీశారు. ఇది పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమా కాకపోయినా.. ఆయన మేకింగ్ స్టైల్ నే గుర్తు చేస్తోంది.

పూరీ డైలాగ్స్.. సునీల్ కాశ్యప్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. నరేష్ రానా సినిమాటోగ్రఫీ.. జానీ షేక్ ఆర్ట్ వర్క్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. జునైద్ సిద్దిఖీ దీనికి ఎడిటర్. లావణ్య సమర్పణలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరీ - ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 'రొమాంటిక్' సినిమా చూసిన పూరీ జగన్నాధ్ కన్నీళ్లు పెట్టుకున్నారని.. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ వారు కూడా భావోద్వేగానికి గురయ్యారని దర్శకుడు చెప్తుండటంతో 'రొమాంటిక్' సినిమా మీద ఆసక్తి రెట్టింపు అవుతోంది. మరి పూరి వారసుడు ఈసారైనా గట్టి హిట్టు కొడతాదేమో చూడాలి.