Begin typing your search above and press return to search.

పూరి 'రొమాంటిక్‌' ఓటీటీ స్ట్రీమింగ్‌ అలర్ట్

By:  Tupaki Desk   |   16 Nov 2021 1:23 PM GMT
పూరి రొమాంటిక్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ అలర్ట్
X
డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ తనయుడు ఆకాష్‌ పూరి హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా రమ్యకృష్ణ ప్రథాన పాత్రలో నటించిన రొమాంటిక్ సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాకు భారీ ఎత్తున పబ్లిసిటీ చేయడం వల్ల మంచి ఓపెనింగ్స్ ను సినిమా దక్కించుకున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు. రెబల్‌ స్టార్‌ ప్రభాస్ మరియు రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో పాటు పలువురు స్టార్స్ రొమాంటిక్ కోసం మీడియా ముందుకు వచ్చారు. ముఖ్యంగా ప్రభాస్ వల్ల రొమాంటిక్ సినిమా జనాల్లోకి ఎక్కువ వెళ్లింది అనడంలో సందేహం లేదు. అందుకే సినిమా కు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఈమద్య కాలంలో థియేటర్‌ రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతున్నాయి. అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ఆహా వారు భారీ మొత్తంను పెట్టి కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. అక్టోబర్‌ 29న థియేటర్‌ రిలీజ్ అయిన ఈ సినిమాను ఓటీటీ లో నాలుగు వారాలు ముగిసిన తర్వాత అంటే నవంబర్‌ 26న స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆహా అధికారికంగా ప్రకటించింది. మొన్నే థియేటర్ రిలీజ్ అయినట్లుగా రొమాంటిక్ ఇంకా మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీ వచ్చింది. దాంతో స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆహా వారు పోస్ట్‌ థియేట్రికల్‌ స్ట్రీమింగ్‌ చేసినా కూడా భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. కనుక ఈ సినిమా కు కూడా ఈ వారం రోజులు పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆహాలో స్ట్రీమింగ్‌ చేసేందుకు గాను రొమాంటిక్ ను భారీ మొత్తంకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా లో ఆకాష్ పూరి నటన కు మంచి మార్కులు పడ్డాయి. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు యాక్షన్‌ సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంది. పూరి ఈ సినిమాకు కథ.. స్క్రీన్‌ ప్లే మరియు డైలాగ్స్ అందించడం తో అంచనాలు మొదటి నుండి పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉందంటూ రివ్యూలు వచ్చాయి. కనుక థియేటర్ లో స్క్రీనింగ్‌ చేయని వారు ఆహా లో స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.