Begin typing your search above and press return to search.
మూడు రోజుల్లో తెరుచుకోనున్న.. ‘రూమ్ నెం.54’
By: Tupaki Desk | 18 May 2021 5:34 AM GMTరెండేళ్లుగా ప్రేక్షకులు చాలా ఆకలితో ఉన్నారు. కాస్త వినోదాన్ని ఆరగించి, ఆస్వాదించే టైమ్ లోనే సెకండ్ వేవ్ దూసుకొచ్చేసింది. రావాల్సిన సినిమాలన్నీ అర్ధంతరంగా ఆగిపోయాయి. చిన్న సినిమాలైనా ఓటీటీలో రిలీజ్ చేస్తారేమోనని అనుకుంటే.. ఒకటీఅరా తప్ప, పెద్దగా వచ్చింది లేదు. దీంతో.. వెబ్ సిరీస్ లే మెయిన్ ఎంటర్ టైన్మెంట్ గా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోతున్న న్యూ వెబ్ సిరీస్ ‘రూమ్ నెం.54’!
దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో రూపొందిన సిరీస్ ఇది. ఇంజనీరింగ్ చదువుతూ కాలేజీ హాస్టల్లోని రూమ్ నెంబర్ 54లో ఉండే స్టూడెంట్స్ కథ ఇది. ఈ ‘రూమ్ నెం.54’కు ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో ఉన్నవారందరికీ వచ్చే బ్యాచ్ స్టూండెట్స్ తో ఓ స్పెషల్ బాండింగ్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉంటున్న నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్లకు కూడా ఏర్పడుతుంది.
ఈ నేపథ్యంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటీ? ఆ సవాళ్లను వాళ్లు ఎలా అధిగమించారు? అనేది ప్రధాన కథాంశం అని వెబ్ సిరీస్ మేకర్స్ తెలిపారు. ఇందులో కృష్ణప్రసాద్, మొయిన్, పవన్ రమేష్, కృష్ణతేజ, శ్వేత, నవ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఐడ్రీమ్ మీడియా ప్రొడ్యూస్ చేసిన ఈ సిరీస్ ను.. సిద్ధార్థ్ గౌతమ్ తెరకెక్కించారు.
ఈ సిరీస్ ను ‘జీ5’ స్ట్రీమింగ్ చేయబోతోంది. మే 21 ముహూర్తంగా నిర్ణయించారు. గతేడాది అమృతం ద్వితీయం, లూజర్, షూట్ ఔట్ ఎట్ ఆలేరు, చదరంగం వంటి సిరీస్ లతో ఆకట్టుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు ‘రూమ్ నెం.54’లోకి ఆడియన్స్ ను తోలేందుకు సిద్ధమైంది. మరి, రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూడాలి.