Begin typing your search above and press return to search.
శ్రీను వైట్లపై భార్య రూప వరకట్నం కేస్!!
By: Tupaki Desk | 26 Oct 2015 3:56 PM GMTదర్శకుడు శ్రీను వైట్ల ఇప్పుడు మరోసారి సంచలనాత్మకమైన హ్యాపెనింగ్ తో వార్తల్లోకి ఎక్కాడు. ఒక వారం క్రితం ఈ దర్శకుడిపై ఆయన భార్య సంతోష రూప వైట్ల బంజారా హిల్స్ స్టేషన్ లో 498/A - 323A సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ సాక్షి తెలిపింది.
మరిన్ని వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా తనని మానసికంగా హింసిస్తూ.. అధిక కట్నం కావాలని పీడిస్తూ.. భౌతికంగా కూడా చేయి చేసుకున్నట్లు రూప వైట్ల తన ఫిర్యాదులో తెలియజేశారు. అయితే ఈ కేసు ఫైల్ చేసి ఒక వారం గడిచినా కూడా.. పోలీసులు మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది పెద్దలు కాబట్టి ఇంకా యాక్షన్ తీసుకోలేదట. ఈలోపే కొందరు ఫిలిం నగర్ పెద్ద తలకాయలు వెంటనే స్పందించి వీరిరువురు మధ్యనా రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఇవాళ సాయంత్రం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుండి రూప వైట్ల కేసును విత్ డ్రా చేసుకున్నారట.
నిజానికి.. డైరక్టర్ గా కోట్లలో పారితోషకం తీసుకుంటున్న శ్రీను వైట్ల.. కట్నం కోసం వేధించారంటే నమ్మలేం. అలాగే మానసికమైన టార్చర్ విషయానికొస్తే.. బహుశా ఆయన ఆగడు ఫెయిల్యూర్.. బ్రూస్ లీ బిలో యావరేజ్ టాక్ తదితర అంశాలతో ఏమైనా కుమిలిపోతున్నారేమో. ఆ ఫ్రస్ర్టేషన్ లోనే దంపతుల మధ్యన ఏమైనా మనస్పర్దలు వచ్చుండొచ్చు అని ఫిలిం నగర్ టాక్. ఇకపోతే దూకుడు - బాద్ షా తదితర సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు రూప వైట్ల.