Begin typing your search above and press return to search.

వైట్ల‌పై రూప ఫైర్ వెన‌క సత్యం ఏమిటి?

By:  Tupaki Desk   |   27 Oct 2015 9:38 AM GMT
వైట్ల‌పై రూప ఫైర్ వెన‌క సత్యం ఏమిటి?
X
హ్యాపీ బ‌ర్త్ డే డియ‌ర్ హ‌జ్బెండ్ శ్రీ‌నువైట్ల‌, ల‌వ్ యు టు ద ఫుల్లెస్ట్ అండ్ బియాండ్ ... ఈ ట్వీట్ చ‌దివాక ఎవ‌రికైనా ఏమ‌నిపిస్తుంది. భ‌ర్త‌పై ఎంత ప్రేమ ఉంటే ఇలాంటి అపురూప‌మైన ట్వీట్ ద‌క్కుతుంది శ్రీ‌నూకి? స‌రిగ్గా నెల‌రోజుల క్రితం శ్రీ‌నువైట్ల పుట్టిన‌రోజు వేళ ఈ ట్వీట్ చేశారు రూప వైట్ల‌. కానీ ఇంతలోనే ఏమైందో? ఉన్న‌ట్టుండి భ‌ర్త శ్రీ‌నువైట్ల‌పై పోలీస్ కేసు పెట్ట‌డం టాలీవుడ్‌ లో చ‌ర్చ‌కొచ్చింది. శ్రీ‌నూ క‌ట్నం కోసం హింసిస్తున్నాడు. భౌతికంగా హ‌రాస్ చేశాడు అంటూ బంజారా హిల్స్ పోలీస్‌ స్టేష‌న్‌ లో సీరియ‌స్‌ గా కేస్ ఫైల్ చేశారు రూప‌ అని వార్తలు వచ్చాయి. అయితే ఇంత‌లోనే అంత సీరియ‌స్ అవ్వ‌డం వెన‌క మిస్ట‌రీ ఇంకేదో ఉంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది అంటున్నారు.

నిజానికి టాలీవుడ్‌ లో స్టార్ డైరెక్ట‌ర్ హోదా అనుభ‌విస్తున్న శ్రీ‌నూవైట్ల‌కి ఇంత ఛీప్ థింకింగ్ ఉంటుందా? ఒక్కో సినిమాకి రూ.10కోట్లు పారితోషికం అందుకునే శ్రీ‌నూ మ‌రీ ఇంత చిల్ల‌ర గొడ‌వ‌కి దిగుతాడా? పైగా బ్రూస్ లీ రిలీజ్ టైమ్‌ లో స్వామి అయ్య‌ప్ప మాల‌ను ధ‌రించిన శ్రీ‌నూ మ‌రీ అంత అస‌భ్యంగా భార్య‌తో ప్ర‌వ‌ర్తించి ఉంటాడా? ఇలాంటి సందేహాలెన్నో జ‌నాల్లో క‌లిగాయి. అస‌లు ఈ కేసు ఓ మిస్ట‌రీ అనే అనుకుంటున్నారంతా. దీనివెనుక అంత‌కు మించి బ‌ల‌మైన ఆర్థిక కార‌ణాలేవైనా ఉన్నాయా? వ‌రుస ప‌రాజ‌యాలు ఆ కుటుంబంలో క‌ల్లోలానికి కార‌ణ‌మ‌య్యాయా? అన్న డిష్క‌స‌న్ ఫిలింన‌గ‌ర్‌ లో జ‌రుగుతోందిప్పుడు. శ్రీ‌నూ పెద‌వి విప్పితేనే అస‌లు నిజాలు తెలిసేది.