Begin typing your search above and press return to search.
ఆ మూడింటికి ఇప్పుడు రూట్ క్లియర్!
By: Tupaki Desk | 1 Oct 2022 4:30 PM GMTమణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిప పీరియాడికల్ మూవీ 'పొన్నియిన్ సెల్వన్ 1'. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న భారీ అంచనాల మధ్య విడుదలైన విషయం్ తెలిసిందే. ప్రఖ్యాత రచయిత కల్కీ కృష్ణ మూర్తి రచించిన ఫేమస్ నవల 'పొన్నియిన్ సెల్వన్' ఆధారంగీ అ మూవీని దర్శకుడు మణిరత్నం రూపొందించారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే యూనానిమస్ గా ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది.
దీంతో ఆ మూడింటికి ఇప్పుడు రూట్ క్లియర్ అయింది. వివరాల్లోకి వెళితే.. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన 'పొన్నియిన్ సెల్వన్ 1'ని తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. భారీ మల్టీస్టారర్ పీరియాడిక్ మూవీగా రూపొందిన ఈ మూవీపై తెలుగులో ప్రారంభం నుంచి పెద్దగా బజ్ లేదు. తమిళంలో భారీ సినిమా కావడం, 'బాహుబలి'ని కొట్టే సినిమా అంటూ తమిళ మీడియా ఓవర్ గా ప్రచారం చేయడంతో అక్కడ ఈ మూవీకి భారీ గా ఓపెనింగ్స్ లభించాయి.
కానీ తెలుగులో మాత్రం పెద్దగా బజ్ లేకపోవడంతో ఆ స్థాయిలో ఓపెనింగ్స్ ని దక్కించుకోలేకపోయింది. సినిమాలో ప్రచారం జరిగినంతగా సగటు ప్రేక్షకుడిని ఎగ్జైట్ చేయగల కంటెంట్ లేకపోవడంతో పెద్దగా ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది. ఇదే ఇప్పుడు మూడు తెలుగు సినిమాలకు ప్లస్ గా మారిందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఒక వేళ ఈ మూవీ టాక్ గనక బాగుంటే మూడు తెలుగు సినిమాలకు థియేటర్ల సమస్య తలెత్తేదని చెబుతున్నారు.
మరో నాలుగు రోజుల్లో మూడు తెలుగు సినిమాలు అక్టోబర్ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటివచిన 'గాడ్ ఫాదర్', కింగ్ నాగ్ నటించిన 'ది ఘోస్ట్', యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న 'స్వాతిముత్యం' ఇబ్బందికి గురయ్యేవి.
'పొన్నియిన్ సెల్వన్ 1' ని దిల్ రాజు రిలీజ్ చేశారు. దీంతో ప్రధాన థియేటర్లన్నీ ఈ సినిమాకే వదిలేశారు. ఇప్పుడు సినిమా ఫ్లాప్ కావడంతో అంతులోని కొన్ని ప్రధాన థియేటర్లని 'గాడ్ ఫాదర్'తో పాటు నాగార్జున 'ది ఘోస్ట్', బెల్లంకొండ గణేష్ 'స్వాతిముత్యం'కు లభించనున్నాయి.
ఒక వేళ 'పొన్నియిన్ సెల్వన్ 1' హిట్ టాక్ ని తెచ్చుకుంటే మూడింటికి ఇప్పుడు థియేటర్ల సమస్య ఎదురయ్యేది. అయితే సినిమా ఫ్లాప్ కావడంతో థియేటర్ల విషయంలో మూడింటికి ఇప్పుడు రూట్ క్లియర్ అయిందని అంటున్నారు. ఫస్ట్ వీక్ అగ్రిమెంట్ తో 'పొన్నియిన్ సెల్వన్ 1'ని ప్రదర్శిస్తున్నారు కాబట్టి మరో రెండు రోజుల్లో ఆ అగ్రిమెంట్ పూర్తి కాబోతోంది. దీంతో థియేటర్ల పరంగా గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యం సినిమాలకు రూట్ క్లియర్ అయినట్టే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.