Begin typing your search above and press return to search.

బాండ్ భామ అప్ప‌ట్లో అలా చేసింద‌ట‌!

By:  Tupaki Desk   |   18 Aug 2018 5:30 AM GMT
బాండ్ భామ అప్ప‌ట్లో అలా చేసింద‌ట‌!
X
సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించింది బాండ్ భామ.. హాలీవుడ్ న‌టి రోస్మండ్ ఫైక్. చెప్పిన ఈ ఉదంతం వింటే..ఎంత‌టి వారికైనా వేషాల కోసం సినిమా క‌ష్టాలు ఖాయ‌మ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. అస్కార్ అవార్డు పొందిన న‌టిగా పేరున్న ఫైన్.. ఇప్పుడు అగ్ర న‌టీమ‌ణుల్లో ఒక‌రైనా.. ఆరంభంలో మాత్రం క‌ష్టాలు త‌ప్ప‌లేదు.

ఆక్స్ ఫ‌ర్డ్ లో చ‌దువుతూ.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో ఆమె ప‌లు టీవీ కార్య‌క్ర‌మాల్లో చేసింది. అయితే.. ఆమె ఆశించినట్లుగా సినిమా అవ‌కాశాలు రాలేదు. ఇలాంటి వేళ‌.. జేమ్స్ బాండ్ సిరీస్ లోని డై అన‌ద‌ర్ డే సినిమా కోసం ఆడిష‌న్లు నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఆమెను లోద‌స్తుల‌తో క‌నిపించాల‌ని కోరారు. 2002లో జ‌రిగిన ఈ ఉదంతాన్ని ఫైన్ తాజాగా వెల్ల‌డించారు. బాండ్ ఆడిష‌న్ కోసం లోదుస్తులతో క‌నిపించాల‌న్న మాట‌కు.. ఆమె త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆ ప‌ని చేయ‌క త‌ప్ప‌లేద‌న్నారు. అవ‌కాశం కోసం త‌ప్ప‌ద‌న్న విష‌యం అర్థ‌మైంది.. అందుకే త‌ప్ప‌లేద‌న్న ఆమె క‌ష్టం ఫ‌లించి ఆమె ఆడిష‌న్లో సెలెక్ట్ అయ్యారు. బాండ్ భామ‌గా వెండితెర‌పై మెరిశారు. ఆ త‌ర్వాత ఆమెకు అవ‌కాశాలు రావ‌టం మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆమె మూడు చిత్రాల్లో న‌టిస్తున్నారు.

బాలీవుడ్ కి.. హాలీవుడ్ కి వ్య‌త్యాసం ఏమంటే.. అగ్ర‌న‌టి అయ్యాక ఆరంభంలో ఎదురైన క‌ష్ట‌న‌ష్టాల గురించి ప్ర‌స్తావించేందుకు ఇష్ట‌ప‌డ‌రు.కానీ.. అందుకు భిన్నంగా కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బంది గురించి బాండ్ భామ మొహ‌మాటం లేకుండా బ‌య‌ట‌పెట్టం చూస్తే.. ధైర్య‌మంటే అదీ అనిపించ‌క మాన‌దు.