Begin typing your search above and press return to search.

రాఘవేంద్రరావుగారితో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు: రోషన్

By:  Tupaki Desk   |   11 Oct 2021 6:30 AM GMT
రాఘవేంద్రరావుగారితో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు: రోషన్
X
చాలా కాలం క్రితం శ్రీకాంత్ హీరోగా చేసిన 'పెళ్లి సందడి' ఆయన కెరియర్ ను అనూహ్యమైన మలుపు తిప్పింది. ఇప్పుడు అదే టైటిల్ తో ఆయన తనయుడు రోషన్ చేశాడు. విజయదశమి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రోషన్ మాట్లాడాడు.

'పెళ్లి సందడి' మా నాన్న కెరియర్లో పెద్ద హిట్ .. ఆ టైటిల్ తో సినిమా చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక ఈ సినిమాను కరోనా సమయంలో ఎన్నో కష్టాలు పడుతూ, ఒక్కరం కూడా కరోనా బారిన పడకుండా షూటింగును పూర్తి చేశాము.

గౌరీ రోణంకి గారి అంకితభావం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడు చూసినా ఆమె ఈ సినిమాను గురించిన కసరత్తు చేస్తూనే వచ్చారు. 'పెళ్లి సందడి' పాత టైటిలే అయినా ఆమె ఈ సినిమాకి న్యూ ఫ్లేవర్ యాడ్ చేశారు. శ్రీధర్ సీపాన మాటాలు బాగా రాశారు .. నిజంగా ఆయన చాలా గమ్మత్తైన మనిషి .. అలాంటి మాటలే రాశారు. నిర్మాతలకు .. ఇక్కడికి వచ్చిన అల్లు అరవింద్ గారికీ .. దిల్ రాజు గారికి కృతజ్ఞతలు. నాకు ఎప్పుడు బోర్ కొట్టినా నేను వెంకటేశ్ గారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని.

మా నాన్న తరం .. నా తరం మాత్రమే కాదు, ఇక రాబోయే తరలవారు కూడా చెప్పుకునే పేరు మెగాస్టార్ చిరంజీవిగారు. మా నాన్నకి ఆయన అంటే ఎంత ఇష్టమో నేను చెప్పనక్కర లేదు. కోవిడ్ సమయంలో ఆయన అందించిన సేవలను ఎవరూ మరిచిపోలేరు. ఇన్ని సాధించిన తరువాత కూడా ఇంకా ఏదో చేయాలనే ఆయనలోని ఆ ఫైర్ నాకు స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటుంది. అలాంటి ఆయన ఇక్కడికి రావడమే నా అదృష్టంగా భావిస్తున్నాను.

'పెళ్లి సందD'కి మ్యూజిక్ అనేది వెన్నెముక లాంటింది. కీరవాణిగారి సంగీతానికి నేను స్టెప్స్ వేస్తానని కలలో కూడా అనుకోలేదు. చంద్రబోస్ గారు నాన్నగారికి 'పెళ్లి సందడి'కి పనిచేశారు .. ఈ సినిమాలోని పాటలకు కూడా మంచి సాహిత్యాన్ని అందించారు. సినిమా అనేది బ్రతకాలంటే మీరంతా కూడా థియేటర్స్ కి వెళ్లి చూడాలి .. మీరంతా థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. మా సినిమాను కూడా థియేటర్లలోనే చూడండి. ఇక రాఘవేంద్రరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో ఎప్పుడు పనిచేస్తానా అని అనుకునేవాడిని.

ఆయన సినిమాలను తగ్గించడం వలన ఇక అవకాశం రావడం కష్టమేనని అనుకున్నాను. కానీ ఆయన నన్ను ఇంటికి పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం నాకు కలిగింది. వెంకటేశ్ గారు చెప్పినట్టు, రాఘవేంద్రరావు గారు సెట్లో ఉంటే చాలా సందడిగా ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేయడమే నేను చేసుకున్న అదుష్టంగా భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.