Begin typing your search above and press return to search.

అల్లుడికి 25.. ఆటో జానీ వచ్చుంటేనా..

By:  Tupaki Desk   |   18 Oct 2016 7:30 AM GMT
అల్లుడికి 25.. ఆటో జానీ వచ్చుంటేనా..
X
తిరుగులేని టాలీవుడ్ నెం.1 గా రెండు దశాబ్దాలు పాటు కిరీటాన్ని పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటివరకూ 149 సినిమాలు చేశారు. ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉంటాయి. అయితే.. జనాలకు అలరించేసి అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసి.. బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిరు సినిమాల లిస్ట్ తీస్తే.. అందులో ''రౌడీ అల్లుడు'' కచ్చితంగా టాప్ లోనే ఉంటుంది.

1991 అక్టోబర్ 18న రిలీజ్ అయిన ఈ మూవీ.. ఇవాల్టితో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. చిరంజీవికి జంటగా శోభన.. దివ్య భారతిలు నటించగా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ ఎంటర్టెయినర్.. బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. చిరంజీవి డ్యుయల్ రోల్ పోషించగా.. ఈ మూవీలో చిరు చేసిన ఆటో జానీ కేరక్టర్ ఇప్పటికీ జనాల మనసుల్లో మెదులుతూ ఉంటుంది. ఇకపోతే సినిమాలో చిరంజీవి మాస్ పంచ్ అండ్ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. బప్పి లహరి అందించిన పాటలూ కూడా సూపర్ ఉంటాయ్. ప్రేమ గీమా తస్సాదియ్యా పక్కనపెట్టు.. తద్దినక తప్పదిక.. లవ్ మీ మై హీరో.. ఒక రేంజు సాంగ్స్ అయితే.. చిలుకా క్షేమమా అనే సాంగ్ ఆల్ టైమ్ హిట్. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అండ్ మ్యూజిక్ లవర్స్ ఆ పాటను వింటూనే ఉంటారు. ఇక అదిరిపోయే పాటలకు స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో తీసిన విజువల్స్ ఇంకా కేకలు పెట్టిస్తాయి. అలాగే సత్యానంద్ అందించిన కథ కంటే కూడా ఆయన రాసిన మాటలు బాగా క్లిక్కయ్యాయ్. వెరసి సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది.

అందుకే చిరు 150వ సినిమా ఆఫర్ పూరీ జగన్ చేతికి వచ్చినపుడు.. ఆటో జానీ కేరక్టర్ తోనే స్టోరీ రాసుకున్నాడు. టైటిల్ కూడా అదే. కానీ సెకండాఫ్ విషయంలో సంతృప్తి కలగకపోవడంతో.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ టైమ్ కి.. ఆటో జానీ సినిమా కనుక సెట్స్ పై ఉంటేనో.. థియేటర్లలో ఉంటేనో.. ''రౌడీ అల్లుడి'' సంబరాలు ఓ రేంజ్ లో ఉండేవి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/