Begin typing your search above and press return to search.
అయిదు నెలలైనా రౌడీ బేబీ ఆగనే లేదు
By: Tupaki Desk | 3 Jun 2019 6:24 AM GMTయూట్యూబ్ లో కొన్ని పాటలు అనూహ్యంగా సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. ఒకప్పుడు గంగ్నమ్ స్టైల్ పాట వంద కోట్ల వ్యూస్ వస్తే వామ్మో అనుకున్నారు. కాని ఇప్పుడు ఇండియన్ వీడియోలకు కూడా ఆ స్థాయి వ్యూస్ రావడం పెద్ద కష్టం ఏమీ కాదనిపిస్తుంది. 50 కోట్ల వ్యూస్ ను దక్కించుకున్న వీడియోలు మరి కొన్నాళ్లకు వంద కోట్లకు కూడా చేరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలకు చెందిన పాట ఒక్కటే 50 కోట్ల మార్క్ ను దాటింది.
బాలీవుడ్ కు చెందిన కాలా చష్మా పాట ఇప్పటి వరకు 59.55 కోట్ల వ్యూస్ ను రాబట్టింది. అయితే ఆ పాట యూట్యూబ్ లో పోస్ట్ అయ్యి దాదాపుగా మూడు సంవత్సరాలు అయ్యింది. మూడు సంవత్సరాలకు కాలా చష్మా సాంగ్ దాదాపుగా 60 కోట్ల వ్యూస్ ను రాబడితే మన సౌత్ రౌడీ బేబీ పాట మాత్రం కేవలం అయిదు నెలల్లో 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.
ధనుష్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన 'మారి 2' చిత్రంలోని రౌడీ పాటకు ప్రభుదేవా డాన్స్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది. సౌత్ ఇండియాలోనే కాకుండా ఈ పాట ఉత్తరాదిని కూడా ఉపేస్తోంది. అందుకే 50 కోట్ల వ్యూస్ ను రాబట్టింది. ఒక సౌత్ సాంగ్ 50 కోట్ల వ్యూస్ ను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ సినిమాలకు సైతం సాధ్యం కాని రికార్డును రౌడీ బేబి అయిదు నెలల్లోనే దక్కించుకుంది. అయిదు నెలలో ఇంత భారీ వ్యూస్ ను దక్కించుకున్న ఈ పాట ముందు ముందు వంద కోట్ల వ్యూస్ ను కూడా రాబట్టుకునే అవకాశం ఉందనిపిస్తోంది.