Begin typing your search above and press return to search.
మళ్లీ రన్నింగ్ రేస్ లోకి 'రౌడీ బేబీ' సాంగ్!
By: Tupaki Desk | 18 May 2022 10:30 AM GMTఒకప్పుడు ఒక సినిమాలో 6 పాటలు ఉంటే, కనీసం 4 పాటలైనా మంచి మార్కులు తెచ్చుకునేవి. కానీ ఇప్పుడు చాలా సినిమాల్లో 4 పాటలు ఉంటే అది గొప్ప విశేషమే అవుతోంది. ఇక వాటిలో ఒక పాట హిట్ అయినా చాలు అనే పరిస్థితి ఉంది. చాలా పాటలను థియేటర్లలోనే వదిలేసి వచ్చేయడం అలవాటైపోయింది. థియేటర్ నుంచి వెంట వచ్చే సాంగ్స్ .. యూ ట్యూబ్ లో మళ్లీ మళ్లీ చూడాలనిపించే పాటలు చాలా తక్కువగా ఉంటున్నాయి. అన్ని కుదిరిన పాటలకు మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
అలాంటి పాటల్లో ఒకటిగా 'రౌడీ బేబీ' సాంగ్ కనిపిస్తుంది. ధనుశ్ - సాయిపల్లవి జంటగా నటించిన 'మారి 2' సినిమాలోనిది ఈ పాట. ధనుష్ హిట్ సినిమాల కంటే ఎక్కువ కాలం ఈ పాటను గురించి మాట్లాడుకున్నారు.
సంగీతం .. సాహిత్యం.. కొరియోగ్రఫీ .. ఆలాపన .. ఇలా అన్నీ సమపాళ్లలో కుదిరిన పాటగా 'రౌడీ బేబీ' కనిపిస్తుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ ఈ పాటకి ప్రధానమైన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. షూస్ లోకి చేతులు పెట్టించి .. విన్యాసాలు చేయించడం కొత్తగా అనిపిస్తుంది.
రథం నడుపుతున్నట్టుగా అనిపించే స్టెప్పు .. ధనుశ్ చేతుల్లోనే సాయిపల్లవి అలా గిర్రున తిరిగిపోవడం .. ఇలా క్రిందికి జారిపోవడం .. చాలా కష్టమైనవిగా అనిపిస్తాయి. ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఈ పాటను ఒకసారి చూసి వదిలేసేవారు అసలు ఉండరేమోనని అనిపిస్తుంది.
అంత కొత్తగా .. గమ్మత్తుగా అనిపిస్తుంది. అలాంటి ఈ పాట ఇండియన్ సినిమా నుంచి ఫాస్టెస్ట్ గా 1 బిలియన్ వ్యూస్ ను అందుకున్న పాటగా నిలిచి కొత్త రికార్డును నమోదు చేసింది. 1.3 బిలియన్ వ్యూస్ కి పైగా నడుస్తున్న సమయంలో కొన్ని కారణాల వలన ఈ పాటను యూ ట్యూబ్ వారు తొలగించారు.
దాంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయింది. ఏం జరిగిందనేది ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకు తొలగించి ఉంటారనే విషయంపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. సమస్య ఏమిటనేది అలా ఉంచితే, మొత్తానికి ఈ సినిమా నిర్మాతలు .. యూ ట్యూబ్ వారితో కలిసి మాట్లాడి పరిష్కరించుకోవడం జరిగిపోయిందట. దాంతో అవే వ్యూస్ తో కంటిన్యూ అయ్యేలా ఈ పాటను అదే ప్లేస్ లో సెట్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇటు ధనుశ్ ఫ్యాన్స్ కి .. అటు సాయి పల్లవి అభిమానులకు ఇది ఆనందాన్ని కలిగించే విషయమే అని చెప్పాలి.