Begin typing your search above and press return to search.

ఒకేసారి నలుగురితో చేయడంతో రొమాన్స్‌ బోర్‌ కొట్టిందా రౌడీ?

By:  Tupaki Desk   |   13 Feb 2020 5:00 AM
ఒకేసారి నలుగురితో చేయడంతో రొమాన్స్‌ బోర్‌ కొట్టిందా రౌడీ?
X
విజయ్‌ దేవరకొండ రేపు ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాను విజయ్‌ దేవరకొండ పట్టించుకోవడం లేదు.. సినిమాపై నమ్మకం లేకపోవడంతో ప్రమోషన్స్‌ కార్యక్రమంలో పాల్గొనడం లేదు అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో చివరి వారం రోజులు చాలా యాక్టివ్‌ గా విజయ్‌ దేవరకొండ ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొని సినిమాకు భారీ క్రేజ్‌ ను తీసుకు వచ్చాడు. ట్రైలర్‌ విడుదల కార్యక్రమం.. ప్రీ రిలీజ్‌ వేడుకలు అంటూ విజయ్‌ ఏదో ఒక విధంగా జనాల మద్య ఉంటున్నాడు.

ట్రైలర్‌ విడుదల సందర్బంగా లవ్‌ స్టోరీ చిత్రాలను మళ్లీ చేయనంటూ ప్రకటించాడు. ఆ మాటలకు కట్టుబడి ఉన్నట్లుగా ఇటీవల ఇంటర్వ్యూలో మళ్లీ చెప్పుకొచ్చాడు. తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేశాడు. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్‌ తో రొమాంటిక్‌ సీన్స్‌ చేశాను. దాంతో రొమాంటిక్‌ సీన్స్‌ కు కాస్త గ్యాప్‌ ఇవ్వాలనిపిస్తుంది. వరుసగా చేసినా కూడా బోర్‌ గా అనిపిస్తుందని విజయ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంలో ఒకేసారి నలుగురు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేయడం వల్ల రొమాన్స్‌ అంటేనే బోర్‌ కొట్టిందా.. విరక్తి పుట్టిందా రౌడీ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ లవ్‌ స్టోరీలు.. రొమాంటిక్‌ సినిమాలు చేయకుంటే ఆయన్ను ఎవరు పట్టించుకోరు అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బోర్‌ కొట్టిందని.. కొత్తదనం కోసం అంటూ ఏదో ట్రై చేస్తే కెరీర్‌ లో నష్టపోవాల్సి వస్తుందని విశ్లేషకులు రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండకు సలహా ఇస్తున్నారు.