Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు బయటకి వచ్చిన విజయ్ దేవరకొండ
By: Tupaki Desk | 7 April 2020 3:10 PM GMTప్రపంచం మొత్తం కంటికి కనిపించని సూక్ష్మజీవి చేతిలో చిక్కుకొని విలవిలలాడి పోతున్నది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో కూడా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. మన తెలుగు రాష్టాల్లో కుడా పోటాపోటీ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కరోనా పై పోరాటంలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు తెలియజేస్తూ వస్తున్నారు. కరోనా బాధితులను ఆదుకోడానికి రాజకీయ ప్రముఖుల నుండి సెలెబ్రెటీల దాకా అందరూ తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు బయటకి వచ్చి కరోనాపై ఇంకొకసారి స్పందించాడు.
తాజాగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కరోనా మహమ్మారి గురించి పోస్ట్ చేస్తూ.. 'నా ప్రియమైన మీరందరూ సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. వైరస్ నుండి కాపాడుకోవడానికి క్లాత్ తో పేస్ కవర్ చేసుకున్నా చాలు, వైరస్ తొందరగా వ్యాప్తి చెందదు. అందుకే వైద్యుల కోసం మెడికల్ మాస్క్‌లను వదిలివేయండి. బదులుగా రుమాలు వాడండి. లేదా కండువా ఉపయోగించండి. లేకపోతె అమ్మ చున్నీనైనా వాడండి. ఏదొక దానితో మీ ముఖాన్ని కప్పుకోండి, సురక్షితంగా ఉండండి’ తన ఫోటోతో కలిపి పోస్ట్ చేశాడు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీ మొత్తం ముందుకొచ్చి సహాయం చేస్తున్నా విజయ్ దేవరకొండ మాత్రం స్పందించడం లేదంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఇండస్ట్రీలో అందరికంటే ముందే కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీడియో రూపంలో తెలియజేసింది విజయ్ దేవరకొండే. ఇప్పుడు తాజాగా మరోసారి జాగ్రత్తలు తెలియజేసి కరోనా పై యుద్ధానికి నేను కూడా ఉన్నానని గుర్తుచేశాడు. కాగా కరోనా వ్యాప్తి నివారణ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అహర్నిశలూ కృషి చేస్తున్నా.. కేసులు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ప్రభుత్వాల సలహాలు, సూచనలు ప్రజలందరూ తూ.చ. తప్పకుండా పాటించాలి. ఈ విపత్కర పరిస్థితిని సమష్టిగా ఎదుర్కోవాలి, అందరూ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు.