Begin typing your search above and press return to search.
రౌడీ బాయ్స్.. 50 డేస్ వెయిట్ చేయిస్తున్న దిల్ రాజు
By: Tupaki Desk | 7 Feb 2022 7:37 AM GMTమొన్న సంక్రాంతికి విడుదల అయిన సినిమాల్లో రౌడీ బాయ్స్ సినిమా ఒకటి. దిల్ రాజు ఫ్యామిలీకి చెందిన అశ్విన్ రెడ్డి హీరోగా మలయాళ క్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన రౌడీ బాయ్స్ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. యూత్ ఆడియన్స్ కి సినిమాలోని లీడ్ పెయిర్ రొమాన్స్ మరియు పాటలు కనెక్ట్ అయ్యాయి. దాంతో సినిమా బ్రేక్ ఈవెన్ వసూళ్లను దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. పలు ఏరియాల్లో ఇంకా కూడా రౌడీ బాయ్స్ సినిమా రన్ అవుతుంది. ఇతర సినిమాలు.. పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో రౌడీ బాయ్స్ కంటిన్యూ అవుతుంది.. జనాలు కూడా ఇంకా సినిమాను చూస్తున్నారని తెలుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈమద్య కాలంలో ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్ రిలీజ్ కంటే కూడా అధికంగా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. థియేటర్లకు వెళ్లి అంత డబ్బు ఖర్చు పెట్టలేని వారు ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఈమద్య కాలంలో ఓటీటీ బిజినెస్ విపరీతంగా పెరిగింది. రౌడీ బాయ్స్ సినిమా కోసం కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఈమద్య కాలంలో విడుదల అయిన ఎక్కువ శాతం సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. పుష్ప సినిమా మూడు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ చేసిన విషయం తెల్సిందే. అందుకే రౌడీ బాయ్స్ సినిమా కూడా మూడు లేదా నాలుగు వారాల్లో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందని అంతా భావించారు. గత నెల సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అయిన రౌడీ బాయ్స్ కి నాలుగు వారాలు పూర్తి కాబోతున్నాయి. కనుక వారం పది రోజుల్లో ఖచ్చితంగా రౌడీ బాయ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ మొదలు అవుతుందని అంతా భావించారు. కాని రౌడీ బాయ్స్ సినిమా స్ట్రీమింగ్ అవ్వడానికి మరో మూడు వారాల సమయం అదనంగా తీసుకుంటున్నారు.
రౌడీ బాయ్స్ సినిమా ను జీ 5 ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. దిల్ రాజు ఓటీటీ స్ట్రీమింగ్ ఒప్పందం లో సినిమా ను 50 రోజులు పూర్తి అయిన తర్వాత స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఓటీటీ లో రౌడీ బాయ్స్ సినిమా ను మార్చి 4వ తారీకున స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా జీ 5 సంస్థ క్లారిటీ ఇచ్చింది. థియేటర్ రిలీజ్ అయిన 50 డేస్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయక పోవడం పై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రౌడీ బాయ్స్ సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అయ్యింది. కనుక నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేయవచ్చు కదా అంటున్నారు. సినిమా కు ఇప్పుడు అయితేనే మంచి బజ్ ఉంటుంది.. కనుక ఎక్కువ శాతం మంది ఓటీటీ ద్వారా చూస్తారు. ఇంకా మూడు నాలుగు వారాల తర్వాత అంటే రాబోతున్న పెద్ద సినిమాల హడావుడిలో రౌడీ బాయ్స్ సినిమా ను జనాలు మర్చి పోయే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయడం అనేది మంచి నిర్ణయంటున్నారు. దిల్ రాజు మరీ 50 రోజులు వెయిట్ చేయించడం భావ్యం కాదని ఓటీటీ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు నిర్ణయం మార్చుకోవాలని వారు కోరుకుంటున్నారు.