Begin typing your search above and press return to search.

దిల్ రాజ్ అత్యాశ 'రౌడీ బాయ్స్' ను దెబ్బేస్తుందా?

By:  Tupaki Desk   |   14 Jan 2022 4:53 AM GMT
దిల్ రాజ్ అత్యాశ రౌడీ బాయ్స్ ను దెబ్బేస్తుందా?
X
మోస్ట్ అవైటింగ్ మూవీలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న వేళ.. ఆ ఖాళీని భర్తీ చేసేందుకు..ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసం అప్పటికప్పుడు కొన్ని సినిమా విడుదలను ప్లాన్ చేశారు. అందులో ఒకటి ‘రౌడీ బాయ్స్’. ఈ మూవీతో సెలబ్రిటీ నిర్మాత దిల్ రాజు.. శిరీష్ కుటుంబాల నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు అశిష్. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీకి దిల్ రాజు మార్కు ట్రీట్ మెంట్ ఉన్న నేపథ్యంలో సినిమా మీద కొంత హోప్ ఉంది. దీనికి తోడు.. సెలెక్టివ్ గా సినిమాల్ని ఎంపిక చేసుకునే క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వర్ ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది.

దీంతో.. ఈ సినిమాకు కొంత బజ్ వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ మూవీ ట్రైలర్ లో హీరోకు అనుపమా ముద్దులు పెట్టేయటం చాలామందికి నచ్చలేదు. పెద్ద హీరోలతో సినిమాలు చేసినప్పుడు పద్దతిగా ఉన్న అనుపమా.. ఇలా ఒక కొత్త హీరో సినిమాలో లిప్ లాక్ చేసేయటం ఏమిటంటూ.. విచిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చి గుస్సా అయ్యారు. మీమ్స్ తో ట్రోల్ చేశారు. చివరకు దీనిపై అనుపమా సైతం రియాక్టు కావాల్సి వచ్చింది.

ఒక కొత్త హీరో.. ఒక పేరున్న హీరోయిన్ ను తన మొదటి సినిమాలోనే లిప్ లాక్ చేయటాన్ని భరించలేని ప్రేక్షకులు.. ఒక కొత్త హీరో సినిమాకు కింగ్ నాగార్జున.. ఆయన తనయుడు నాగచైతన్య కలిసి నటిస్తున్న బంగార్రాజు మూవీకి సరి సమానంగా టికెట్ ధరను డిసైడ్ చేయటం ఏమిటి? అది అన్యాయమే అవుతుంది కదా? ఇప్పటికే ఏపీలో సినిమా టికెట్ల ధరల్ని భారీగా తగ్గించేస్తే.. తెలంగాణలో పెంచేయటం తెలిసిందే. అయితే.. తెలంగాణ ప్రభుత్వం ఒక అవకాశాన్ని ఇచ్చింది. టికెట్ ధరను రూ.125 నుంచి రూ.250 వరకు ఎంతైనా అమ్ముకోవచ్చని అవకాశం ఇచ్చింది.

అంటే.. తమ సినిమా టికెట్ ను ఏ ధరకు ఫిక్స్ చేయాలన్నది సదరు నిర్మాత డిసైడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. సాధారణంగా ఏదైనా కంపెనీ తాము ఉత్పత్తి చేసే కొత్త ప్రొడక్టుకు కాస్తంత తక్కువ ధర పెట్టటం.. అది సాధ్యం కాదంటే.. మంచి ఆఫర్ తో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు.

ఈ లెక్కన చూసినా.. ఆశిష్ చేసిన రౌడీ బాయ్స్ ను ప్రీమియం ధర.. అంటే రూ.200చొప్పున మల్టీఫ్లెక్సుల్లో డిసైడ్ చేయటం.. ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలు చేస్తే.. మరో ముప్పై రూపాయిలు అదనంగా హ్యాండిలింగ్ ఛార్జీల వాయింపు.. అంటే దగ్గర దగ్గర రూ.250 వరకు టికెట్ ధర డిసైడ్ చేయటం ఎంతవరకు సబబు?

ఇప్పటికే కరోనా దెబ్బకు సినిమా హాలుకు రావాలా? వద్దా? అని జనాలు అనుకున్న వేళ.. కాస్తధైర్యం చేసి వచ్చే వారికి..టికెట్ ధర చూసి.. వామ్మో అంత అవసరమా? కొత్త హీరో సినిమాకు ఇంత ధర డిసైడ్ చేస్తే.. ఏమైపోవాలని జనాలు అనుకుంటే.. మొదటికే మోసం రావటం ఖాయం కదా? అదేమీ లేదు.. కొత్త హీరో అయినా సినిమా ధర మాత్రం సీనియర్ నటుల సినిమాలకు సరిసమానంగా ఉందంటే.. తమ సినిమా మీద నిర్మాతకు ఎంత నమ్మకమన్న కాన్సెప్టు వర్కువుట్ అవుతుందన్న తెలివైన వాదనను వినిపించొచ్చు. ఇవాల్టి రోజున జనాలు మరీ అంత అమాయకులుగా ఏమీ లేరు.

కాసింత వెయిట్ చేస్తే.. నెలరోజుల్లో ఓటీటీలో సినిమా వచ్చే వేళ.. ఫ్యామిలీతో పాటు వెళ్లి అన్నేసి డబ్బులు.. అందులోనూ కొత్త హీరో మూవీకి అంటే ఖర్చు గురించి ఆలోచించరా? పేరున్న నటి కొత్త హీరోకు ముద్దు పెట్టేసినందుకే అంతలా నెటిజన్లు రియాక్టు అయితే.. సినిమా టికెట్ ధర తమ జేబుకు చిల్లు పెట్టేసే వేళలో.. సగటు ప్రేక్షకుడు ఏ సినిమాకు వెళ్లాలన్న విషయంలో.. రౌడీ బాయ్స్ కు ఓటు వేసేందుకు వీల్లేకుండా చేసిందంటున్నారు. ఆ వాదనే నిజమైతే.. దిల్ రాజు వారి అత్యాశ.. కొత్త హీరో ఆశిష్ కు దెబ్బేయటం ఖాయమని చెప్పక తప్పదు.మరేం జరుగుతుందో చూడాలి.