Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో రౌడీ స్టార్ క్రేజ్ మామూలుగా లేదుగా..!

By:  Tupaki Desk   |   21 July 2022 11:30 AM GMT
బాలీవుడ్ లో రౌడీ స్టార్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
X
యంగ్ సెన్సేషన్ విజయ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'పెళ్లిచూపులు' సినిమాతో హీరోగా మారిన వీడీ.. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో యూత్ ‏లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమాలతోనే కాకుండా తన రియల్ ఫైల్ యాటిట్యూడ్ మరియు తన ప్రవర్తనతో ఎక్కువమందిని ఆకర్షించాడని చెప్పాలి.

ఈ విధంగానే అమ్మాయిలలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నాడీ రౌడీ స్టార్. చాలామంది హీరోయిన్లకి కూడా విజయ్ దేవరకొండ ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ VD కి మంచి క్రేజ్ ఉంది. ఒక్క హిందీ సినిమా కూడా చేయక ముందే ఎంతోమంది బాలీవుడ్ భామలకు ఫేవరేట్ అయ్యాడు.

ఇప్పటికే అనేకమంది బాలీవుడ్ హీరోయిన్లు విజయ్ దేవరకొండ అంటే తమకు ఇష్టమని.. అతనితో స్క్రీన్ షేర్ చేసుకోడానికి ఎదురుచూస్తున్నామని మనసులో మాటను బయటపెట్టారు. మరికొందరు ముద్దుగుమ్మలైతే ఒకడుగు ముందుకేసి విజయ్ తో డేటింగ్ చేయాలని ఉందని చెప్పేశారు.

ఇటీవల 'కాఫీ విత్ కరణ్' సెలబ్రిటీ టాక్ షో 7వ సీజన్ రెండో ఎపిసోడ్ కి బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్ మరియు సారా అలీఖాన్ గెస్టులుగా వచ్చారు. ఇందులో తమ వ్యక్తిగత విషయాలతో పాటుగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కాఫీ విత్ కరణ్ షో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. చిట్ చాట్ సందర్భంగా ఎవరితో డేటింగ్ కి వెళ్లాలనుకుంటున్నావ్? అని కరణ్ జోహార్ అడగ్గా.. 'విజయ్ దేవరకొండ' అని సారా అలీఖాన్ సమాధానం చెప్పింది.

గతంలో సారా పలు సందర్భాల్లో VD అంటే ఇష్టమని చెప్పింది. ఫ్యాన్ మూమెంట్ అంటూ రౌడీ హీరోతో క్లోజ్ గా జఉన్న ఓ ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది సారా. ఇప్పుడు లేటెస్టుగా కరణ్ టాక్ షోలో ఏకంగా విజయ్ తో డేటింగ్ చేస్తానని చెప్పి మరోసారి అతని మీదున్న ఇష్టాన్ని చాటుకుంది.

అలానే మరో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కూడా గతంలో VD అంటే ఇష్టమని తెలిపింది. ఇప్పుడు అతనితో కలిసి నటిస్తుండటం గమనార్హం. ఇక జాన్వీ కపూర్ సైతం మూడేళ్ళ క్రిందటే విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.

ఒక్క హిందీ సినిమా కూడా రిలీజ్ కాకుండానే.. ఇలా బీటౌన్ కుర్ర భామలంతా విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెప్తున్నారంటే టాలీవుడ్ యంగ్ హీరో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక 'లైగర్' సినిమా రిలీజ్ తర్వాత రౌడీ బాయ్ పాపులారిటీ నెక్ లెవల్ కు చేరే అవకాశం ఉంది.

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''లైగర్''. ఈ సినిమాతో వీడీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంటే.. అనన్య పాండే టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఇది విజయ్ - పూరీ లకు ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి తగ్గట్టుగానే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్ట్ 25న తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

ఇప్పుడు 'లైగర్' సినిమా హిట్టయితే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ హీరోగా మారే అవకాశం ఉంది. అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే 'JGM'(జనగణమన) అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాడు వీడీ. మధ్యలో 'ఖుషీ' అనే ఓ రొమాంటిక్ లవ్ స్టోరీతో పలకరించబోతున్నాడు.