Begin typing your search above and press return to search.
ఈ సారి విషాద ప్రేమకథని చెబుతున్నాడా?
By: Tupaki Desk | 21 Sep 2022 12:30 AM GMTరెండు దశాబ్దాల క్రితం అంతా కొత్తవారితో `చిత్రం` మూవీతో లవ్ స్టోరీస్ కు శ్రీకారం చుట్టిన తేజ దర్శకుడిగా మంచి గుర్తింపుని సొతంం చేసుకున్నాడు. తనదైన మార్కు ప్రేమకథా చిత్రాలని తెరకెక్కిస్తూ తన సినిమాలకు యూత్ లో మంచి క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. తరువాత చేసిన ప్రేమకథలు కూడా అదే తరహాలో మ్యూజికల్ గానూ బ్లాస్టింగ్ హిట్ లుగా నిలవడంతో తేజ లవ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.
చిత్రం, నువ్వు నేను, జయం, జై, అవునన్నా కాదన్నా, లక్ష్మీ కల్యాణం వంటి సినిమాలు దర్శకుడిగా తేజకు ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అయితే గత కొంత కాలంగా ఆ స్థాయి సక్సెస్ లని, ఆ స్థాయి ప్రేమకథల్ని తేజ అందించలేకపోతున్నాడు. `సీత` డిజాస్టర్ కావడంతో కొంత విరామం తీసుకున్న తేజ మళ్లీ తన పాత ఫార్ములానే నమ్ముకుని `అహింస` పేరుతో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. ఈ మూవీ ద్వారా దగ్గుబాటి వారి వారసుడు, డి. సురేష్ బాబు తనయుడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు.
తనే హీరోలుగా పరిచయం చేసిన వారిని స్క్రీన్ పై కొత్తగా ప్రజెంట్ చేసిన తేజ .. అభిరామ్ విషయంలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తోంది. బయట అభిరామ్ ఎలా వుంటాడో సినిమాలోనూ అదే విధంగా కనిపిస్తున్నాడు. స్క్రీన్ పై కొత్తగా ఏమీ కనిపించడం లేదు. సినిమాని ఓ యధార్థ కధగా చూపించాలన్న ప్రయత్నం కారణంగానే తేజ ఇలా అభిరామ్ ని చూపిస్తున్నాడా? అన్నది తెలియాల్సి వుంది.
ఈ మూవీతో గీతిక అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. చాలా కాలం తరువాత ఆర్పీ పట్నాయక్ .. తేజతో కలిసి పని చేస్తున్నాడు. సమీర్ రెడ్డి, శంకర్.. ఇలా పాత బ్యాచ్ ఈ మూవీకి పని చేస్తోంది. వీరంతా తేజతో కలిసి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ లని అందించిన వారే కావడం విశేషం. అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ స్టిల్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఏమంతగా ఆసక్తిని రేకెత్తించడం లేదు.
ఆర్పీ అందించిన బాణీలు, సిద్ శ్రీరామ్ గానంతో ఫస్ట్ సింగిల్ ఫరవాలేదనిపించింది. అయితే ఈ పాటలో హీరో, హీరోయిన్ ని ఓ తోపుడు బండిలో కూర్చోబెట్టి లాగుతున్నట్టుగా చూపించారు. అయితే అదే బండికి సెలెన్ బాటిల్ వేలాడుతూ కనిపిస్తోంది. అంటే హీరోయిన్ పేషెంట్ అని తెలుస్తోంది. రొమాంటిక్ ఎమోషనల్ లవ్ స్టోరీలకు ఒకప్పుడు కెరాఫ్ అడ్రస్ గా నిలిచిన తేజ `అహింస` విషయంలో మాత్రం తన పంథాకు భిన్నమైన విషాద కథని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి కథతో తేజ దగ్గుబాటి వారి వారసుడిని ఎలా గట్టెక్కిస్తాడో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.