Begin typing your search above and press return to search.
78 ఎంకి పాటలు RP నోట
By: Tupaki Desk | 27 March 2019 1:30 AM GMTవంగ తోట కాడ ఎంకి నాయుడు రొమాన్స్ గురించి వినడమే కానీ కనడమేదైనా ఉందా? రంగస్థలం లాంటి సినిమాల్లో రామ్ చరణ్ నాయుడు మామలా మారితే, సమంత ఎంకి గా కనిపిస్తే మెచ్చాం కానీ .. ఒరిజినల్ లోని ఎంకిని - నాయుడిని చూసుకునే భాగ్యం మనకు ఇన్నాళ్లకు కలిగిందా? వందేళ్ల చరిత్ర ఉన్న ఎంకి పాటలను కళ్ల ముందుకు విజువలైజ్ చేసి తెస్తామంటే కాదనే వారుంటారా? అందుకే ఆర్ పి చేస్తున్న ఆ ప్రయత్నానికి ప్రశంసలు దక్కుతున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే..
నండూరి వారి ఎంకి పాటల శృంగార రసం గురించి చెప్పతరమా? ఎంకి పాటలు అనేవి నండూరి వెంకట సుబ్బారావు రచించిన గేయ సంపుటి. తెలుగు సాహిత్యంలో ప్రణయ భావుకతకూ - పదాల పొందికకూ క్రొత్త అందాలు సమకూర్చిన ఈ రచనను ఎంకి పాటల గాలి దుమారము అని తెలుగు సాహితీకారులు పలు సందర్భాలలో ప్రస్తావించారు. ఎంకి పాటలలో సుబ్బారావు గోదావరి మాండాలికాన్ని విశాఖ రూపక బేధాలతో కలిపి ఉపయోగించారు. యెంకి పాటలు ప్రధానంగా ప్రణయానికి సంబంధించిన పాటలు. తొలి వలపులు - దాంపత్య జీవితానురాగాలు కలిసిన ఊసులు - బాసలు - వేదనలు - విరహాలు ఈ పాటల్లో చక్కని పదాల కూర్పుతో పల్లె పట్టు అందంతో అలరించాయి. యెంకి పల్లె పడుచు. కపటం ఎరుగనిది. జానపద సౌందర్యానికి ప్రతీక. అందుకే ఎప్పటికీ చరిత్రలో నిలిచింది. ఎంకి తో నాయుడు రొమాన్స్ ను మన సినిమాల్లో అవసరం మేర సృజించారు మన సృజకులు.
అందుకే ఈ గేయాల్ని విజువలైజ్ చేసేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ చేస్తున్న ప్రయత్నాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఎంకి పాట... RP నోట పేరుతో ఎంకి నాయుడు బావ 78 పాటలు తెలుగు వారిని - పాటల ప్రియుల్ని అలరించనున్నాయి. ఇందులో ఇప్పటికే పాతిక పాటల్ని తెరకెక్కించేశారని తెలుస్తోంది. ఇది భారీ బడ్జెట్ తో చేస్తున్న మెగా ప్రాజెక్ట్ అని ఆర్.పి.పట్నాయక్ హైదరాబాద్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు. ఇక ఎంకి పాటలు ఆర్‌పికి పేరు తేవడం ఖాయం అన్న చర్చా సాగుతోంది. ఎంకిగా అంతశీలా ఘోష్ - నాయుడుగా ప్రశాంత్ నటిస్తున్నారు. గానం: ఆర్.పి - శ్రుతి నండూరి (సుబ్బారావు మనవరాలు). సమర్పణ: ఆదిత్య మ్యూజిక్.