Begin typing your search above and press return to search.

సాయిధరమ్ తేజ్ మీద కాదు.. ముందు వాళ్ల మీద కేసులు పెట్టాలి: ఆర్పీ పట్నాయక్

By:  Tupaki Desk   |   11 Sep 2021 12:23 PM GMT
సాయిధరమ్ తేజ్ మీద కాదు..  ముందు వాళ్ల మీద కేసులు పెట్టాలి: ఆర్పీ పట్నాయక్
X
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నిన్న హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి పెద్ద ఎత్తున టాలీవుడ్ లో చర్చ సాగుతోంది. మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాయిధరమ్ తేజ్ పై పోలీసులు రెండు కేసు నమోదు చేశారని తెలిసింది. ఈ విషయంపై తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంలో పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆర్పీ పట్నాయక్ మండిపడ్డారు. అదే సమయంలో ప్రమాదానికి అసలు కారణాన్ని వదిలేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి రోడ్డుపై ఇసుక పేరుకు పోయి ప్రమాదం జరగడానికి కారణమైన కన్ స్ట్రక్షన్ కంపెనీపై.. ఎప్పటికప్పుడు రోడ్డును క్లీన్ చేయని జీహెచ్ఎంసీపై కూడా కేసు పెట్టాలని ఆర్పీ పట్నాయక్ డిమాండ్ చేశారు. ఈ కేసు వల్ల నగరంలోని మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించేవారు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారని ఆర్పీ చెప్పుకొచ్చాడు.

సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడడానికి రోడ్డుపై ఇసుక ఉండడమే కారణమని.. బైక్ అందువల్లే స్కిడ్ అయ్యిందని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించి దాని మేరకు రిపోర్ట్ తయారు చేశారని పోలీసులు అంటున్నారు. ర్యాష్ డ్రైవింగ్ అభియోగంపై సాయిధరమ్ తేజ్ పై గచ్చిబౌలిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ కింద సెక్షన్ 184,336 ప్రకారం సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లు, జీహెచ్ఎంసీపై కూడా కేసులు పెట్టాలని ఆర్పీపట్నాయక్ డిమాండ్ చేయడం సంచలనమైంది. దీనిపై ఇప్పటివరకు అటు పోలీసులు కానీ.. జీహెచ్ఎంసీ కానీ స్పందించలేదు.