Begin typing your search above and press return to search.
ఆర్పీకి రాముడే ఇప్పించిన అవకాశం
By: Tupaki Desk | 23 March 2018 4:43 AM GMTటాలీవుడ్ సంగీత దర్శకుల్లో ఆర్పీ పట్నాయక్ కు విభిన్నమైన శైలి ఉంది. చిరకాలం నిలిచిపోయే ట్యూన్స్ ను కూడా అందించాడు. పలు చిత్రాలను తన సంగీతంతోనే నిలబెట్టేశాడు కూడా. ఆ తర్వాత నటుడిగా కూడా కొన్ని సినిమాలతో మెప్పించిన ఆర్పీ పట్నాయక్ కు.. ఇప్పుడు అవకాశాలు అంతగా అందడం లేదు.
అయితే.. ఆర్పీ పేరు.. సంగీతం వాడవాడలా మార్మోగిపోయే ఛాన్స్ ఒకటి వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఈ కంపోజర్. 'ఈ శ్రీరామ నవమికి భద్రాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అలాగే అక్కడ సహస్రార్చన చేయించాలన్నది నా ఆలోచన. అలా ఈ భద్రాచలం టూర్ గురించి మనసులో నిర్ణయించుకున్నానో లేదో.. ఇలా వెంటనే ఓ మంచి అవకాశం తలుపు తట్టింది. ఓ వీడియో సాంగ్ కు సంగీతం అందించమని నన్ను కోరారు. శంషాబాద్ కు చేరువలో అమ్మపల్లి అనే గ్రామం ఉంది. ఇక్కడ 100 ఏళ్ల పురాతనమైన రామ మందిరం ఉందనే విషయం తెలిసింది' అన్నాడు ఆర్పీ పట్నాయక్.
'అర్జున్ కొండవీటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వీడియో సాంగ్ అద్భుతంగా వచ్చింది' అని చెబుతున్నాడు ఆర్పీ పట్నాయక్. ఈ చారిత్రాత్మక ఆలయంలో జరిగే సీతారామ కళ్యాణం వేడుకకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని ఈ వీడియో ద్వారా తాను కోరుతున్నట్లు చెప్పాడు ఆర్పీ.