Begin typing your search above and press return to search.
నా సలహా పాటిస్తే చక్రి బతికేవాడు
By: Tupaki Desk | 27 Dec 2017 11:47 AM GMTమూడేళ్ల కిందట మ్యూజిక్ డైరెక్టర్ చక్రి హఠాన్మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. తెలుగు సినీ ప్రియులు కూడా ఈ విషయాన్ని అంత సులువుగా జీర్ణించుకోలేకపోయారు. ఎన్నో సూపర్ హిట్ ఆడియోలు అందించి సంగీత ప్రియుల్ని ఆనందంలో ముంచెత్తిన చక్రి.. మూడు పదుల వయసులోనే ఇలా అర్ధంతరంగా తనువు చాలిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. చిన్నప్పట్నుంచే చక్రి కొంచెం బొద్దుగా ఉండేవాడు. కానీ గత కొన్నేళ్లలో విపరీతంగా బరువు పెరిగిపోయి.. చాలా ఎబ్బెట్టుగా తయారయ్యాడు. అతడి లుక్ చూస్తేనే ఏదో తేడాగా ఉందన్న విషయం అందరికీ అర్థమైంది. ఇండస్ట్రీ జనాలు కూడా చాలామంది చక్రిని హెచ్చరించిన వాళ్లే. కానీ చక్రిలో మార్పు రాలేదు. చివరికి అతడి ప్రాణమే పోయింది.
తనకు అత్యంత సన్నిహితుడైన చక్రి.. తాను చెప్పిన సలహాను పాటించి ఉంటే బతికేవాడేమో అంటున్నాడు అతడి సమకాలీన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. చక్రి చనిపోవడానికి కొన్ని నెలల ముందు అతడిని ఆరోగ్యం విషయంలో తాను హెచ్చరించినట్లు ఆర్పీ తెలిపాడు. సింగపూర్లో తేలిగ్గా బరువు తగ్గేందుకు ఒక టెక్నిక్ ఉన్నట్లు తనకు తెలిసిందని.. ఈ విషయమే చక్రికి చెప్పి అక్కడికి వెళ్లమన్నానని ఆర్పీ తెలిపాడు. ఐతే ఒకటికి రెండుసార్లు చెప్పినా.. సరే అన్నాడే తప్ప చక్రి అక్కడికి వెళ్లలేదని అన్నాడు. దీనికి కారణం అడిగితే.. చాలా పనులున్నాయని.. అవి పూర్తి చేసి వెళ్తానని చక్రి చెప్పాడని.. ఆ పనులన్నీ తాను చేసి పెడతానని.. ముందు సింగపూర్ వెళ్లమని తాను అన్నానని.. అతను సరే అన్నాడని.. కానీ అతను సింగపూర్ వెళ్లకముందే ఘోరం జరిగిపోయిందని.. తన సలహా పాటించి ముందే సింగపూర్ వెళ్లి చికిత్స చేయించుకుని ఉంటే.. చక్రి ఈ రోజు అందరి మధ్య ఉంటూ తన సంగీతంతో అందరినీ అలరించేవాడని ఆర్పీ ఆవేదన వ్యక్తం చేశాడు.