Begin typing your search above and press return to search.
హారర్ లో కొత్త జోనర్ అంటున్నాడు
By: Tupaki Desk | 9 March 2016 3:30 PM GMTఇప్పుడు హారర్ సినిమాలకు మంచి సీజన్ నడుస్తోంది. కాసింత కంటెంట్ - మరికొంత కామెడీ ఉంటే.. బాక్సాఫీస్ దగ్గర బాగా క్లిక్ అవుతున్నాయి మూవీస్. అయితే తులసీదళం అనే హారర్ సినిమానే చేస్తున్నా.. అందులో కొత్త కోణాన్ని టచ్ చేశామంటున్నాడు ఆర్పీ పట్నాయక్.
"హారర్ అనగానే అందరూ చీకటిలో చేయాలనే అనుకుంటూ ఉంటారు. నేను అక్కడి నుంచే మొదలు పెట్టి.. బ్రైటర్ సైడ్ లో చేశాను. ప్రతీ ప్రేమకు ఓ సమస్య ఉంటుంది. ఆ సమస్య హారర్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఈ సినిమా చేశాం. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ ఇది. సాధారణంగా హారర్ సినిమాలు ఎక్కడ ఆగిపోతాయో.. తులసీదళం అక్కడే మొదలవుతుంది" అని చెప్పాడు ఆర్పీ పట్నాయక్. ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - సంగీతం అందించడమే కాదు.. తనే నిర్మిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు కూడా. నిర్మాతగా చేసిన తొలి మూవీ కావడంతో.. ఆ విభాగంలో అనుభవం, అవగాహన లేక విడుదల కొంత ఆలస్యమయిందని, ఇప్పుడు మార్చ్ 11న బ్రహ్మాండమైన స్థాయిలో రిలీజ్ చేస్తున్నామని చెప్పాడు ఆర్పీ. దేవుడికి సమానస్థాయి తులసిది. అందుకే ఆ టైటిల్ ఎంచుకున్నానని, సినిమా చూశాక అందరికీ ఈ టైటిల్ ఎందుకు పెట్టామో అర్ధమవుతుందన్నాడు.
ఈ చిత్రాన్ని లాస్ వెగాస్ లో 44 రోజుల పాటు షూటింగ్ చేశామని చెప్పిన ఆర్పీ.. తులసీదళంను విదేశాల్లో చిత్రీకరించినా.. ఇండియన్ సెంటిమెంట్స్ అన్నీ ఉంటాయని అన్నారడు. అత్యంత వెలుతురు ఉండే ప్రాంతం కావడంతోనే ఈ ఏరియాని ఎంచుకున్నామని, లాస్ వేగాస్ లో మంచుకొండలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదని ఆర్పీ పట్నాయక్ అంటున్నాడు. తులసీదళం తర్వాత మనలో ఒకడు చిత్రంలో కూడా ఆర్పీ కీలక రోల్ లో నటిస్తున్నాడు.