Begin typing your search above and press return to search.
ఆర్పీని తేజ అంత మాట అనేశాడా?
By: Tupaki Desk | 23 May 2017 6:34 AM GMTడైరెక్టర్ తేజ.. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ ల బంధం కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అని చెప్పలేం. వాళ్ల మధ్య ఒకప్పుడు ఎంత గొప్ప సమన్వయం ఉండేదో.. ఇద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ కలిసి దాదాపు పది సినిమాలకు పని చేశారు. ‘చిత్రం’ సినిమాతో ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమలోకి దూసుకొచ్చారు. ఆ తర్వాత నువ్వు నేను.. జయం లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. ఆ తర్వాత తేజ-ఆర్పీ కాంబోలో వచ్చిన సినిమాలు అంత విజయం సాధించకపోయినా.. ఇద్దరి బంధం కొనసాగింది. అలాంటిది ఆర్పీని ఉద్దేశించి ‘ఔనన్నా కాదన్నా’ టైంలో తేజ అన్నాడని చెబుతున్న మాటలు వింటే ఆశ్చర్యం కలగక మానదు.
మామూలుగా తాను పారితోషకాల గురించి పెద్దగా పట్టించుకోనని.. నిర్మాత ఎంతిస్తే అంత తీసుకుంటానని.. ఐతే ‘ఔనన్నా కాదన్నా’ సినిమాకు నిర్మాత చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చాడని ఆర్పీ తెలిపాడు. ఇదే విషయం తేజ దగ్గరికి తీసుకెళ్తే.. ప్రస్తుతం మీ పొజిషనేంటో అర్థం చేసుకోండి అంటూ చేసిన కామెంట్ తనను బాధించిందని ఆర్పీ తెలిపాడు. ఆ మాటతో తాను షాకయ్యానని.. ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి సైలెంటుగా వచ్చేశానని ఆర్పీ వెల్లడించాడు. తేజ నుంచి అలాంటి మాటను తాను ఊహించలేదని ఆర్పీ తెలిపాడు. ఐతే ఈ విషయాన్ని మనసులో పెట్టుకోలేదని... ఆ తర్వాత కూడా తేజతో తన బంధాన్ని కొనసాగిస్తున్నానని.. ఎప్పుడైనా ఎదురు పడినా నవ్వుతూ పలకరిస్తానని ఆర్పీ తెలిపాడు. ఐతే ‘ఔనన్నా కాదన్నా’ తర్వాత తేజ-ఆర్పీ కలిసి పని చేయకపోవడాన్ని బట్టి ఆ ‘మాట’ ఇద్దరి మధ్య చిచ్చు రేపిందనే అనుకోవాలి. ఐతే స్వయంగా తాను కూడా వరుస ఫ్లాపుల్లో కొట్టు మిట్టాడుతూ ఉండి కూడా తేజ.. ఆర్పీని అంతటి మాట ఎలా అనేశాడో?