Begin typing your search above and press return to search.

RRR 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్..!

By:  Tupaki Desk   |   4 April 2022 4:57 PM GMT
RRR 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్..!
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం) సినిమా బాక్సాఫీస్ ‏ను షేక్ చేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

జక్కన్న టేకింగ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల అద్భుతమైన పెర్ఫార్మన్స్ కు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. అందుకే RRR విడుదలై పది రోజులు గడుస్తున్నా ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. రోజు రోజుకీ ట్రిపుల్ ఆర్ ప్రభంజనం మరింత పెరుగుతోంది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారనడానికి 10వ రోజు వసూళ్లే నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం పదవ రోజు రూ. 16.20 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. దీంతో ఏపీ & తెలంగాణాలలో సినిమా మొత్తం షేర్ రూ. 229 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఉగాది రోజు నుండి ఈ సినిమా కేవలం 20 శాతం మాత్రమే డ్రాప్‌ అయింది. ఊహించిన దాని కంటే ఇది చాలా మెరుగ్గా ఉన్నట్లే అర్థం. రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి పది రోజులు మాత్రమే టికెట్ రేట్లు పెంచుకోడానికి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

రేపటి నుంచి రెండు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. దీంతో రాబోయే వారం రోజుల్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. కాకపోతే టికెట్ రేట్లు తగ్గడం అనేది మంచి థియేటర్ ఆక్యుపెన్సీలను కలిగి ఉండటానికి సహాయపడుతుంది.

అధిక ధరల ఉన్న ఇప్పటివరకు RRR సినిమా చూడని ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఇప్పుడు థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇది మరిన్ని వసూళ్ళు అందుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.

ఇక నార్త్ సర్క్యూట్ లో RRR సినిమా సూపర్ సాలిడ్ గా ఉంది. రెండో ఆదివారం రూ. 20.50 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో హిందీలో పది రోజుల్లో రూ. 91.5 కోట్ల షేర్ తో.. 221 కోట్ల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా 484.17 కోట్ల షేర్ తో 870 కోట్లు గ్రాస్ అందుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

* వరల్డ్ వైడ్ గా RRR 10 రోజుల వసూళ్ళు పరిశీలిస్తే... (ట్రేడ్ నివేదికల ప్రకారం)

నైజాం – 97.01 కోట్లు
సీడెడ్ – 40.20 కోట్లు
యూఏ – 30.05 కోట్లు
నెల్లూరు – 7.96 కోట్లు
గుంటూరు – 16.09 కోట్లు
కృష్ణా – 12.75 కోట్లు
వెస్ట్ – 11.44 కోట్లు
ఈస్ట్ – 13.67 కోట్లు
*AP/TS మొత్తం - 229.17 కోట్లు (315 కోట్ల గ్రాస్)

కర్ణాటక - 36 కోట్లు (68 కోట్ల గ్రాస్)
తమిళనాడు - 34 కోట్లు (72 కోట్లు గ్రాస్)
కేరళ - 9 కోట్లు (22 కోట్ల గ్రాస్)
నార్త్ ఇండియా - 91.5 కోట్లు (221 కోట్ల గ్రాస్)
ఓవర్సీస్ - 84.5 కోట్లు (183 కోట్లు)
*మొత్తం (వరల్డ్ వైడ్) - 484.17 కోట్లు (870 కోట్లు గ్రాస్)

కాగా, ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్‌ గా ఎన్టీఆర్ నటించారు. అజయ్ దేవగన్ - ఆలియా భట్‌ - ఒలివియా మోరిస్‌ - శ్రియా - సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.