Begin typing your search above and press return to search.
RRR 6వ వారంలో 6 కోట్లు.. కేజీఎఫ్ 2 మూడోవారంలో 8 కోట్లు!
By: Tupaki Desk | 8 May 2022 6:30 AM GMT2022లో హిందీ బాక్సాఫీస్ ని షేక్ చేసిన పాన్ ఇండియా చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ రికార్డులకెక్కింది. ఈ చిత్రం 6వ వారంలో రన్ అవుతోంది. ఇది బహిందీ నుంచి RRR చిత్రం ఎంత వసూలు చేసింది? ఇప్పటికి మొత్తం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అన్నది చెక్ చేస్తే డేటా ఇలా ఉంది.
RRR హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద 6వ వారంలో రూ. 5.52 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికి మొత్తం కలెక్షన్లు రూ. 270.66 కోట్లు. ఓవరాల్ గా హిందీలో 300 కోట్ల క్లబ్ లో చేరుతుందా? అన్నది ఇప్పటికి చెప్పలేని సన్నివేశం ఉందని విశ్లేషిస్తున్నారు.
రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం కొద్దిరోజుల క్రితం విడుదలైంది. ఈ సంవత్సరంలో అతిపెద్ద విడుదలలలో ఒకటిగా బోలెడంత హైప్ తో వచ్చి 1000 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో అలియా భట్-అజయ్ దేవగన్ కూడా నటించారు. హిందీలో భారీ ఓపెనింగ్ లతో మొదలై కలెక్షన్లలో మంచి వృద్ధిని సాధించింది. వేగంగా రూ. 100 కోట్ల మార్క్ ని అందుకున్న చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ రికార్డులకెక్కింది.
ఇప్పుడు నడుస్తున్న ఆరవ వారంలో RRR మరో రూ. 5.52 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా మొత్తం కలెక్షన్లు ఇప్పుడు రూ. 270.66 కోట్లు. 2022లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ర్యాంక్ పొందిన RRR 300 కోట్ల మార్క్ ని అందుకుంటుందా లేదా? అన్నది వేచి చూడాలని బాలీవుడ్ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.
ఇక ఆర్.ఆర్.ఆర్ తర్వాత విడుదలైన కేజీఎఫ్ 2 కూడా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక వసూళ్ల రేంజును పరిశీలిస్తే...RRR 6వ వారంలో 6 కోట్లు రేంజులో వసూలు చేస్తుండగా.. కేజీఎఫ్ 2 మూడోవారంలో 8 కోట్లు రేంజులో వసూలు చేస్తోంది. ఒక రోజుకు ఈ రేంజు కలెక్షన్లు టైగర్ ష్రాఫ్ హీరో పంతికి కూడా రాలేదు. దేవగన్ రన్ వే 34 కి కూడా ఇంత సీన్ కనిపించడం లేదు.
అయితే మునుముందు మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ లో మెగా హాలీవుడ్ ఎంటర్ టైనర్ డాక్టర్ స్ట్రేంజ్ విడుదలతో RRR వసూళ్లు.. కేజీఎఫ్ 2 వసూళ్లు ప్రభావితమవుతాయని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ సౌత్ సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద మునుముందు రోజుల్లో ఎలా పోటీపడతాయి? అన్నది వేచి చూడాలి.