Begin typing your search above and press return to search.
RRR 6 రోజుల కలెక్షన్స్: బాక్సాఫీస్ వద్ద జక్కన్న డామినేషన్..!
By: Tupaki Desk | 31 March 2022 9:31 AM GMTవరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ''ఆర్.ఆర్.ఆర్'' సినిమా డామినేషన్ కొనసాగుతోంది. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పడానికి.. ఈ సినిమా దూసుకుపోతోందనడానికి రోజువారీ వసూల్లే రుజువు.
ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మాగ్నమ్ ఓపస్.. భారీ కలెక్షన్స్ రాబడుతోంది. వీకెండ్ లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ RRR సాలిడ్ గా నిలబడింది. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం 9.35 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టి 6 రోజులకు 177.20 కోట్లు వసూలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
సోమ మంగళవారాలతో పోల్చుకుంటే బుధవారం RRR వసూళ్ళు కాస్త తగ్గినప్పటికీ.. పాండమిక్ తర్వాత బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గానే నిలబడిన సినిమాగానే చెప్పాలి. ఈ వీకండ్ లో మళ్లీ పుంజుకొని మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే శనివారం ఉగాది పండుగ మరియు ఆదివారం హాలిడేలు ఈ సినిమాకు కలిసిరానున్నాయి.
నార్త్ మార్కెట్ లో మంగళవారం నాడు 100 కోట్ల మార్క్ ను దాటిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ.. బాక్సాఫీస్ వద్ద అదే స్పీడ్ ను కొనసాగిస్తోంది. 6వ రోజున 13 కోట్ల కలెక్షన్ ని సాధించింది. RRR హిందీ వెర్షన్ ఆరు రోజుల్లో మొత్తం 120.59 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
రోజు వారీ కలెక్షన్ల గురించి చెప్పాలంటే RRR మొదటి రోజు 20.07 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 2 - 3 - 4 - 5 మరియు 6వ రోజులలో వరుసగా 24 కోట్లు - 31.50 కోట్లు - 17 కోట్లు - 15.02 కోట్లు - 13 కోట్లు వసూళ్లు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
'ఆర్.ఆర్.ఆర్' రాజమౌళికి 100 కోట్ల మార్క్ ను దాటిన 3వ చిత్రం.. చరణ్ - తారక్ లకు ఫస్ట్ సినిమా. తొలి ఆట నుంచీ పాజిటివ్ రివ్యూలు - అభిమానులు మరియు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం.. దానికి తగ్గట్టుగానే మంచి వసూళ్లను రాబడుతోంది.
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి తనకంటూ ఒక కొత్త బెంచ్మార్ ను సెట్ చేసుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో RRR సినిమా ఎలాంటి అద్భుతాలు చేయబోతుందో.. కలెక్షన్ ఎలా ఉంటాయో చూడాలి.
ఆంధ్రప్రదేశ్/తెలంగాణ రాష్ట్రాల్లో ఆరు రోజుల RRR కలెక్షన్స్ వివరాలు పరిశీలిస్తే...
నైజాం - 78.10 కోట్లు
సీడెడ్ - 32 కోట్లు
యూఏ - 21.85 కోట్లు
నెల్లూరు - 6.18 కోట్లు
గుంటూరు - 13.48 కోట్లు
కృష్ణా - 10.23 కోట్లు
వెస్ట్ - 9.56 కోట్లు
ఈస్ట్ - 10.79 కోట్లు
AP/TS మొత్తం - 177.19 కోట్లు
నార్త్ ఇండియా - 120.59 కోట్లు
కాగా, అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల స్పూర్తితో ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో పాటుగా అజయ్ దేవగన్ - ఆలియా భట్ - ఒలివియా మోరిస్ - శ్రియా - సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.