Begin typing your search above and press return to search.
RRR -ఆచార్య.. చెర్రీ పెండింగ్ వర్క్ ఎంత?
By: Tupaki Desk | 3 May 2021 5:30 AM GMTకోవిడ్ మహమ్మారీ అంతా మార్చేస్తోంది. సెకండ్ వేవ్ ఉధృతి పాతిక సినిమాల షూటింగులకు బ్రేక్ వేసింది. ఎన్నో సినిమాల ప్రారంభోత్సవాలను ఆపేసింది. పాన్ ఇండియా సినిమాలకు ఇది పెద్ద ముప్పుగా మారింది. అన్ని కేటగిరీల రిలీజ్ తేదీలు గందరగోళంలో పడ్డాయి. చరణ్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ - ఆచార్య కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఇటీవల కోవిడ్ సెకండ్ వేవ్ ని దృష్టిలో ఉంచుకుని చిరంజీవి- రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `ఆచార్య` షూటింగ్ ఆపేశారు. రెండవ వేవ్ తగ్గిన తర్వాత మాత్రమే యూనిట్ తిరిగి పనిలోకి వస్తుంది.
తాజా సమాచారం.. సుమారు 14 రోజుల షూట్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ తన భాగాన్ని పూర్తి చేయాలంటే ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కొరటాల శివకు ఈ విషయంలో క్లారిటీ ఉంది. చిత్రీకరణ పునఃప్రారంభించిన వెంటనే చరణ్ భాగాన్ని చకచకా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది అయిపోగానే.. వెంటనే RRR పెండింగ్ చిత్రీకరణకు చరణ్ వెళ్ళవచ్చు. ఆర్.ఆర్.ఆర్ కోసం చరణ్ కాస్త ఎక్కువ కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుంది. క్లైమాక్స్ లో కొన్ని ఎపిసోడ్స్ ఆలియాతో సీన్స్ చేయాల్సి ఉంది.
ఆచార్య ఈ ఆగస్టులో విడుదల చేస్తారని కథనాలు వచ్చాయి. కాని రిలీజ్ తేదీపై టీమ్ నుంచి స్పష్ఠత రావాల్సి ఉంది. ఆర్.ఆర్.ఆర్ వాయిదా అంటూ సాగుతున్న ప్రచారంపైనా క్లారిటీ రావాల్సి ఉంది.