Begin typing your search above and press return to search.

షాకింగ్.. RRR విలన్ కన్నుమూత

By:  Tupaki Desk   |   23 May 2023 8:14 AM
షాకింగ్.. RRR విలన్ కన్నుమూత
X
ఆర్ఆర్ఆర్ మూవీలో బ్రిటిష్ ఆఫీసర్ స్కాట్ పాత్ర లో నటించిన హాలీవుడ్ యాక్టర్ ని అంత సులభంగా ఎవరూ మరిచిపోలేరు. కేవలం చూపులతోనే క్రూరత్వాన్ని పండించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ కి ఆర్ఆర్ఆర్ ఇండియన్ వైడ్ గా విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. రాజమౌళి పెర్ఫెక్ట్ గా ఆ పాత్ర కి రే స్టీవెన్ సన్ ని ఎంపిక చేసారనే కితాబు లభించింది.

ఇదిలా ఉంటే ఈ హాలీవుడ్ నటుడు తాజాగా మృతి చెందారు. షూటింగ్ సెట్ లోనే అకస్మాత్తుగా అతను మరణించినట్లు తెలుస్తోంది. స్టీవెన్ సన్ థోర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులకి చేరువ అయ్యారు. ఐర్లాండ్ కి చెందిన స్టీవెన్ సన్ బ్రిటిష్ ఓల్డ్ వీక్ థియేటర్ లో యాక్టింగ్ నేర్చుకున్నారు. ఆపై బుల్లితెర పై అడుగు పెట్టారు.

ది థియరీ ఆఫ్ ఫ్లైట్ మూవీతో హాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. తరువాత మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన థోర్ సిరీస్ తో విశేషమైన గుర్తింపు వచ్చింది. ఆ సినిమా చూసి రాజమౌళి స్టీవెన్ సన్ ని ఆర్ఆర్ఆర్ లో బ్రిటిష్ ఆఫీసర్ స్కాట్ పాత్రకి ఎంపిక చేశారు. ఆయన మరణ వార్తని ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.

స్కాట్ పాత్రలో నటించిన స్టీవెన్ సన్ జ్ఞాపకాలు నిత్యం తమతో ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన హాలీవుడ్ వెబ్ సిరీస్ అషికా లో నటించారు. త్వరలో అది డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదిలా ఉంటే ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షూటింగ్ సెట్ లోనే ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.

స్టీవెన్ సన్ మృతి పై హాలీవుడ్ ప్రముఖులతో పాటు ఆర్ఆర్ఆర్ కి పని చేసిన ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా గొప్ప నటుడుగా ఎదుగుతున్న సమయంలో రే స్టీవెన్ సన్ మృతి చెందడం తీరని లోటని చెప్పాలి. ఇక స్టీవెన్ సన్ పనిషర్: వార్ జోన్, కింగ్ ఆర్థర్, ఆక్సిడెంట్ మెన్ లాంటి మూవీస్ లో నటించి మెప్పించారు.