Begin typing your search above and press return to search.

స్టైలిష్ ఎన్నారై పాత్రలో త్రివిక్రమ్ హీరో.. ఫ్యాన్స్ కి పండగేనట!

By:  Tupaki Desk   |   10 Jun 2020 3:45 AM GMT
స్టైలిష్ ఎన్నారై పాత్రలో త్రివిక్రమ్ హీరో.. ఫ్యాన్స్ కి పండగేనట!
X
తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ పై ప్రత్యేక అభిమానం ఏర్పరచుకున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత సినిమా 2018 బ్లాక్ బస్టర్ లలో ఒకటి. ఎన్టీఆర్ సినీ కెరీర్లో అరవింద సమేత మంచి విజయంగా నిలిచిందని అందరికి తెలిసిందే. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలిస్తే ఆ మ్యాజిక్ కాస్త వేరుగా ఉంటుంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ నుండి కొత్తరకం బాడీ లాంగ్వేజ్, బాషా యాస పలికించిన ఘనత త్రివిక్రమ్ సొంతం. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీ అయిపోయాడు. అల వైకుంఠపురంలో.. తర్వాత త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే తెరకెక్కించనున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లోపు విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ ప్రస్తుతం కేవలం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల మీద దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్టీఆర్ తో ఈ సినిమా పూర్తి చేశాకే వేరే సినిమా గురించి ఆలోచిస్తారని ఇదివరకే కన్ఫర్మ్ చేసాడు. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే.. పొలిటికల్ ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ ఎన్నారై పాత్రలో కనిపించనున్నాడట. విదేశాల నుండి వచ్చిన ఎన్నారై అనుకొని కొన్ని రాజకీయ కుట్రల మధ్య ఇరుక్కు పోతాడని సమాచారం. అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అసలు విషయం తెలియాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు!