Begin typing your search above and press return to search.
కోవిడ్ రోగులకు RRR ఆలియా సాయం
By: Tupaki Desk | 27 April 2021 2:30 AM GMTగత కొద్ది రోజులుగా మాల్దీవుల్లో ఉన్న అలియా భట్ భారతదేశం నుండి వచ్చే పర్యాటకులకు ఆ దేశం కొత్త ఆంక్షలను ప్రకటించక ముందే ముంబైకి తిరిగి వచ్చారు. కోవిడ్ -19 రెండవ వేవ్ మొత్తం దేశంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతోంది. ఈ కాలంలో అవసరమైన వారికి సహాయం చేయడానికి వారి సోషల్ మీడియా రీచ్ ను ఉపయోగించాలని చాలామంది ప్రముఖులను కోరుతున్నారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనించిన అలియా భట్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో అవసరమైనవారికి సహాయం అందిస్తానని కోవిడ్ -19 రోగులు .. వారి కుటుంబాల నుండి అభ్యర్థనలను స్వీకరిస్తున్నామని ప్రకటించారు. ఈ నటి జర్నలిస్ట్ ఫయే డిసౌజాతో కలిసి బాధితులకు సేవలు అందించేందుకు పనిచేయనుంది. వారు సంబంధిత సమాచారం అభ్యర్థనలను గుర్తిస్తారు.
గత కొన్ని వారాలలో సోను సూద్... తాప్సీ.. స్వరా భాస్కర్.. భూమి పెడ్నేకర్.. సోనాల్ చౌహాన్ వంటి తారలు వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అలియా కూడా మంచి కోసం ప్రజల ప్రయోజనాల కోసం తమ పరిధిని ఉపయోగిస్తున్న ప్రముఖుల జాబితాలో చేరుతున్నారు. తెలుగు సినీపరిశ్రమలో కోవిడ్ విలయం సమయంలో పలువురు స్టార్లు సీఎం నిధికి విరివిగా విరాళాలిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సీసీసీ ద్వారా ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈసారి కోవిడ్ వ్యాక్సినేషన్ ని సీసీసీ ద్వారా చేస్తున్న సంగతి తెలిసిందే.