Begin typing your search above and press return to search.

#RRR : త్వరలో కీలక అనౌన్స్‌ మెంట్‌

By:  Tupaki Desk   |   16 Feb 2019 1:22 PM GMT
#RRR : త్వరలో కీలక అనౌన్స్‌ మెంట్‌
X
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ మల్టీస్టారర్‌ లో హీరోయిన్స్‌ ఎవరు అనే విషయమై గత మూడు నాలుగు నెలలుగా పతాక స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఎన్నో వార్తలు పుట్టుకు వచ్చాయి. ఈ చిత్రంలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నారని, ఇద్దరు ఇండియన్‌ బ్యూటీస్‌ కాగా, మూడవ ముద్దుగుమ్మ ఫారిన్‌ నుండి దిగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇన గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ఆలియా భట్‌ మరియు పరిణితి చోప్రాలు హీరోయిన్స్‌ గా ఎంపిక అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి. పారితోషికం విషయంలో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. అయితే తాజాగా హీరోయిన్‌ విషయంలో క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రం కోసం ఆలియా భట్‌ ను ఓకే చేశారట. మొదట ఆరు కోట్లు డిమాండ్‌ చేయడంతో ఆలియా భట్‌ ను పక్కకు పెట్టిన జక్కన్న తాజాగా ఆమె పారితోషికం విషయంలో రాజీ పడటంతో ఆమెను ఫైనల్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో ఒకే హీరోయిన్‌ ఉంటుందని, మరో కీలక పాత్రలో ఫారిన్‌ ముద్దుగుమ్మ ఉంటుందని వార్తలు వస్తున్నాయి, రాజమౌళి త్వరలోనే హీరోయిన్‌ గా ఆలియా భట్‌ ను ఎంపిక చేసినట్లుగా అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అసలు సినిమాకు సంబంధించిన ప్రకటన ఈమద్య కాలంలో ఏది రాలేదు. త్వరలో రాబోతున్న ప్రకటన హీరోయిన్‌ విషయం అంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రంలో ఆలియా భట్‌ ఎవరికి జోడీగా నటించబోతుందనేది ప్రస్తుతం జనాలను తొలుస్తున్న ప్రశ్న. ఇన్‌ సైడ్‌ టాక్‌ ప్రకారం రామ్‌ చరణ్‌ కు జోడీగా ఆలియా భట్‌ కనిపించే అవకాశం ఉందని - ఎన్టీఆర్‌ చాలా బాడీ పెంచడంతో పాటు, రఫ్‌ లుక్‌ కు మారబోతున్నాడు. అలాంటి పాత్రకు ఆలియా భట్‌ హీరోయిన్‌ గా సెట్‌ అవ్వదు. అందుకే ఆలియా భట్‌, చరణ్‌ ల జోడీ కన్ఫర్మ్‌ అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి రకరకాలుగా జరుగుతున్న చర్చకు రాజమౌళి ఏ ప్రకటనతో ఫుల్‌ స్టాప్‌ పెడతాడో చూడాలి.