Begin typing your search above and press return to search.

నిర్భంధంలోంచి వెలుతురులోకి RRR ఆలియా!

By:  Tupaki Desk   |   10 April 2021 1:30 PM GMT
నిర్భంధంలోంచి వెలుతురులోకి RRR ఆలియా!
X
క‌రోనా మ‌హ‌మ్మారీ సెకండ్ వేవ్ సినీతార‌ల్ని వెంటాడుతున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టికే నిర్ధేషించిన షెడ్యూల్స్ ని పూర్తి చేయ‌డంలో భాగంగా స్టార్లు అంతా విమానాశ్ర‌యాల వెంట ప‌రుగులు పెడుతున్నారు. మ‌రోవైపు సెకండ్ వేవ్ ఉధృతి అమాంతం పెర‌గ‌డంతో క‌రోనా భారిన ప‌డుతున్నారు. బాలీవుడ్ లో ఇటీవ‌ల డ‌జ‌ను మంది ప్ర‌ముఖులు క‌రోనా భారిన ప‌డి చికిత్స పొందుతున్నారు.

ఈ జాబితాలో ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియాభ‌ట్ కూడా ఉన్నారు. ఆలియా ఓవైపు ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ కోసం మ‌రోవైపు భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో గంగూభాయి క‌తియావాడీ చిత్రీక‌ర‌ణ కోసం అటూ ఇటూ ర‌న్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు ప్రియుడు ర‌ణ‌బీర్ కి క‌రోనా సోకాక తాను కూడా స్వీయ‌నిర్భంధంలోకి వెళ్లింది. కొద్దిరోజుల గ్యాప్ త‌ర్వాత త‌న‌కు కూడా క‌రోనా సోకింద‌ని అభిమానుల‌కు సోష‌ల్ మీడియాల్లో ఆలియా వెల్ల‌డించారు.

ఏప్రిల్ ఆరంభం స్వీయ‌నిర్భంధంలో ఉన్న ఆలియా ఎట్ట‌కేల‌కు కోవిడ్ -19 నుండి కోలుకోవడంతో తన ఇంటి గ‌ది నుండి స‌న్ లైట్ లోకి వ‌చ్చారు. అందుకు సంబంధించిన ప్రూఫ్ గా రెండు సన్ లైట్ సెల్ఫీలను పంచుకున్నారు. ఈ నెల ప్రారంభంలో ఆలియా కు పాజిటివ్ అని తెలిసింది. కేవ‌లం పదిరోజుల చికిత్స‌తో కోలుకున్నారు.

ఇంట్లో శ‌య‌న‌మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆలియా సూర్యకాంతిలోకి వ‌చ్చిన ఆ ఫోటోల్లో కాస్త నీర‌సంగానే క‌నిపిస్తోంది. తెల్లటి టాప్ ధ‌రించి మారిన ముఖాకృతితో కనిపిస్తోంది. ``డ్రీమర్స్ ని ఎప్పుడూ మేల్కొలపవద్దు`` అని తన పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు. దీనికి క్లౌడ్ ఎమోజీని జోడించారు.దీనిపై స్పందించిన‌ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ `వావ్` అని రిప్ల‌య్ ఇచ్చారు. అలియా త్వరగా కోలుకుని రీఎన‌ర్జీతో రావాల‌ని అభిమానులు ఆకాంక్షించారు.

అలియా న‌టిస్తున్న బ్ర‌హ్మాస్త్ర‌- ఆర్.ఆర్.ఆర్- గంగూబాయి కతియావాడి రిలీజ్ ల‌కు రావాల్సి ఉంది. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల ఇవ‌న్నీ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిన‌దే.