Begin typing your search above and press return to search.

'బాహుబలి' ని పోలిన డిజైనింగ్ లో RRR పోస్టర్స్..!

By:  Tupaki Desk   |   15 March 2022 2:30 AM GMT
బాహుబలి ని పోలిన డిజైనింగ్ లో RRR పోస్టర్స్..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మార్చి 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

RRR సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు - టీజర్లు - ట్రైలర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకుని సినిమాపై సాలిడ్ బజ్ క్రియట్ చేసింది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని.. శరవేగంగా ప్రమోషన్స్ చేశారు. దేశవ్యాప్తంగా స్పెషల్ ఈవెంట్స్ తో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

అయితే కరోనా థర్డ్ వేవ్ పాండమిక్ కారణంగా వాయిదా వేసుకొని ఈ నెల 25న థియేటర్లలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో RRR మేకర్స్ మళ్ళీ ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్ 'బాహుబలి' సినిమా పోస్టర్ ని పోలి ఉండటం అభిమానులని నిరుత్సాహ పరిచింది.

'ఆర్.ఆర్.ఆర్' - 'బాహుబలి' చిత్రాలకు సంబంధించిన రెండు విభిన్న పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నిశితంగా గమనిస్తే ఈ పోస్టర్లు ఒకేలా కనిపిస్తున్నాయి. రాజమౌళి పోస్టర్ల మీద ఫోకస్ పెట్టకుండా ఇలాంటి బాహుబలి డిజైన్లను ఆమోదించాడని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. కాదు ఇదంతా జక్కన్న సెంటిమెంట్ గానే చేశాడని మరికొందరు అంటున్నారు.

కారణం ఏమైనప్పటికీ రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో 'బాహుబలి' రేంజ్ సక్సెస్ అందిస్తారా లేదా అనే దానిపై సినీ అభిమానులు ఆసక్తిగా వేచి చూపుతున్నారు. మరోసారి తెలుగు సినిమా స్టామినా ఎంతో ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పాలని బలంగా కోరుకుంటున్నారు. మరి RRR బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో చూడాలి.

కాగా, విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత స్వభావాల ఆధారంగా కల్పిత కథతో ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రాన్ని తెరకెక్కించారు రాజమౌళి. ఇందులో రామరాజుగా రాం చరణ్.. భీమ్ గా తారక్ కనిపించనున్నారు. అలియా భట్ - అజయ్ దేవగన్ - ఒలివియా మోరిస్ - శ్రియా శరణ్ - సముద్ర ఖని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కీరవాణి

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ను నిర్మించారు. దీని కోసం సుమారు 550 కోట్లు ఖర్చు చేయగా.. 900 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.