Begin typing your search above and press return to search.

'ఆర్ ఆర్ ఆర్' ని ట‌చ్ చేయ‌ని 'కేజీఎఫ్‌-2'..ఇదెలా సాధ్య‌మంటే?

By:  Tupaki Desk   |   19 Jun 2022 9:30 AM GMT
ఆర్ ఆర్ ఆర్ ని ట‌చ్ చేయ‌ని కేజీఎఫ్‌-2..ఇదెలా సాధ్య‌మంటే?
X
పాన్ ఇండియా చిత్రాలగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చి `ఆర్ ఆర్ ఆర్` ..`కేజీఎఫ్‌-2` సంచ‌ల‌నాల గురించి చె ప్పాల్సిన ప‌నిలేదు. రెండు బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రాల‌గా నిలిచాయి. వ‌సూళ్ల ప‌రంగా బాక్సాఫీస్ వ‌ద్ద పోటాపోటీగా నిలిచాయి. కానీ అంతిమంగా..వ‌సూళ్ల ప‌రంగా `ఆర్ ఆర్ ఆర్` ని `కేజీఎఫ్‌-2` బీట్ చేసింది వాస్త‌వం. రెండు చిత్రాల మ‌ధ్య వ‌సూళ్ల ప‌రంగా వ్య‌త్యాసం 100 కోట్లుంది.

ఆలెక్క‌లో రికార్డు ప‌రంగా `కేజీఎఫ్‌-2` బెస్ట్ అని చెప్పాలి. కానీ అంత‌ర్జాతీయంగా `ఆర్ ఆర్ ఆర్` కి ద‌క్కిన గుర్తింపు కేజీఎఫ్ -2కి ద‌క్క‌లేదు అన్న‌ది అంతే వాస్త‌వం. గ్లోబల్ స్థాయిలో `ఆర్ ఆర్ ఆర్` కి ప్ర‌త్యేక‌మై గుర్తింపు ద‌క్కింది అన‌డానికి వీటినే ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓవ‌ర్సీస్ లో థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసిన త‌ర్వాత యూఎస్ లో ఎన్కోర్ పేరుతో `ఆర్ ఆర్ ఆర్` రీరిలీజ్ జ‌రిగిన‌ సంగ‌తి తెలిసిందే.

ప్రీమియ‌ర్ల రూపంలో సినిమా చ‌క్క‌ని వ‌సూళ్ల‌ని సాధించింది. నాన్ ఇండియ‌న్స్ తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడాయి. సినిమాని మెచ్చి ఎంతో మంది వీదేశీయులు ట్విట‌ర్ వేదిక‌గా ట‌చ్ లో కి వ‌చ్చారు. అలాగే రాటెన్ టోమాటోస్ లో రిజిస్ట‌ర్ అయిన తొలి సౌత్ సినిమాగా మ‌రో అరుదైన ఘ‌న‌త `ఆర్ ఆర్ ఆర్` సాధించింది. కేవ‌లం హిందీ వెర్ష‌న్ లో రిలీజ్ అయిన చిత్రానికే ఈ రేంజ్లో అప్లాజ్ ద‌క్కింది.

ఇంగ్లీష్ వెర్ష‌న్ రిలీజ్ చేసి ఉంటే ఇంకా బెట‌ర్ స్థానంలో `ఆర్ ఆర్ ఆర్` అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు ద‌క్కించుకునేది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా కంటెంట్..విజువ‌ల్ గా హైలైట్ అవ్వ‌డం..గ్రాండియ‌ర్ లుక్ `ఆర్ ఆర్ ఆర్` ని ఆ స్థానంలో నిల‌బెట్టాయి అన్న‌ది అంతే వాస్త‌వం. మిలియ‌న్ ఫాలోవ‌ర్లు క‌లిగిన గేమ్ డిజైన‌ర్ కొజిమా హిడియా సైతం ఆర్ ఆర్ ఆర్ గురించి ట్వీట్ చేయ‌డం మ‌రో విశేషంగా చెప్పొచ్చు. కానీ ఇలాంటి అప్రిసియేషన్స్ `కేజీఎఫ్‌-2` విష‌యంలో ఎక్క‌డా చోటు చేసుకోలేదు.

ఓటీటీలో రిలీజ్ అయినా `కేజీఎఫ్‌-2` కేవ‌లం వీక్ష‌ణ‌కే ప‌రిమిత‌మైంది త‌ప్ప‌! స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవ్వ‌లేదు. ఈ విష‌యంలో అమెజాన్ ప్రైమ్ కొన్ని ర‌కాల ప్రమోష‌న్ స్ర్టాట‌జీని సైతం అప్లై చేసిన‌ప్ప‌టికీ ప‌న‌వ్వ‌లేదు. కేవ‌లం పాన్ ఇండియా వ‌ర‌కూ ఆ రీచ్ కుదిరింది. ఎలివేష‌న్ ప‌రంగా `ఆర్ ఆర్ ఆర్` కన్నా కేజీఎఫ్‌-2 ఉన్న‌తంగా ఉంటుంది. కానీ అవేవి విదేశీయుల్ని అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఆ ర‌కంగా `ఆర్ ఆర్ ఆర్` ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మనే చెప్పాలి. మ‌రోసారి గ్లోబ్లల్ స్థాయిలో రాజ‌మౌళి మార్క్ ప‌డింద‌ని క‌చ్చితంగా చెప్పాల్సి ఉంది.