Begin typing your search above and press return to search.
RRR - సాహో ఓవర్సీస్.. ఏది నిజం?
By: Tupaki Desk | 13 Jun 2019 2:09 PM GMTఇండియా మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్స్ గా ప్రచారం సాగుతున్న RRR - సాహో చిత్రాలపై దుబాయ్ షేట్ కర్చీఫ్ వేశారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. ఈ రెండు సినిమాల ఓవర్సీస్ రైట్స్ కోసం ఫార్స్ అనే సంస్థ దాదాపు 109 కోట్ల మేర గంపగుత్తగా డబ్బు వెదజల్లుతోందని ప్రచారం హోరెత్తిపోతోంది. అయితే ఇది నిజమా? అంటే ..
సాహో ఓవర్సీస్ రైట్స్ కోసం వారు 42 కోట్లు .. RRR రైట్స్ కు 67 కోట్లు విసిరేస్తున్నారట! ప్రస్తుతం ఆ రెండు కంపెనీలతో సదరు దుబాయ్ కంపెనీ చర్చలు సాగిస్తోందని ఒకటే ప్రచారం సాగుతోంది. ఈ రెండు సినిమాల మీద 109 కోట్లు జల్లేస్తున్నారని ఒకటే ఊదరగొట్టేస్తున్నారు. అంతేకాదు దుబాయ్ కి చెందిన ఫార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో అగ్రిమెంట్ అయిపోయిందన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇది నిజమా? అంటే అంతా ఉత్తుత్తి ప్రచారమేనని చెబుతున్నారు. ``మాటల వరకూ జరిగాయ్.. కానీ ఎవరూ కొనలేదు.. దుబాయ్ షేట్ అడిగినా ఇంకా సాహో రైట్స్ కూడా ఇవ్వలేదు.. ఆయనే ఆర్.ఆర్.ఆర్ ట్రై చేస్తున్నారు.. కానీ తెగలేదు..`` అంటూ తాజాగా అత్యంత క్లోజ్ సోర్స్ ద్వారా రివీలైంది.
ఇకపోతే ఈ డీల్ కి సంబంధించిన సమాచారం రేపటికి పక్కాగా క్లారిటీ వస్తుందని కూడా మరో సోర్స్ నుంచి రివీలైంది. ఫార్స్ అనే సంస్థ ఈ రెండు చిత్రాల ఓవర్సీస్ రైట్స్ ను దక్కించుకునేందుకు సీరియస్ గానే ట్రై చేస్తోంది. అయితే యువి క్రియేషన్స్ (సాహో).. డివివి ఎంటర్ టైన్ మెంట్స్(ఆర్.ఆర్.ఆర్) సంస్థలతో మంతనాలు మాత్రమే సాగాయి ఇప్పటివరకూ. తాజా సోర్స్ ప్రకారం.. రేపటితో ఈ డీల్ కి సంబంధించిన వాస్తవ వివరం తెలుస్తుందనే భావిస్తున్నారు.