Begin typing your search above and press return to search.
#ఆర్‌ఆర్‌ఆర్ : మనోభావాలు దెబ్బతింటాయా?
By: Tupaki Desk | 6 July 2021 9:30 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా విడుదల తేదీపై రకరకాల పుకార్లు చేస్తున్నాయి. ఈ సినిమా కోసం జక్కన్న అభిమానులు మరియు ప్రేక్షకులు మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా దాదాపుగా ఏడాది ఆలస్యం అవుతోంది. ఈ సినిమా స్వాతంత్ర సమరయోధులు అయిన కొమురం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజుల కథ. కాని ఈ సినిమాలో వారి నిజమైన కథను చూపించడం లేదు. ఆ పాత్రలతో పూర్తిగా కల్పిత కథను రాజమౌళి టీమ్ అల్లారు. పూర్తిగా కల్పిత కథ అవ్వడం వల్ల వివాదాలకు తావు ఉండదని రాజమౌళి భావిస్తున్నాడు. కాని కొందరు మాత్రం వివాదాలు చేసేందుకు రెడీ గా ఉన్నట్లుగా అనిపిస్తుంది.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను విడుదల సమయంలో వివాదాస్పదం చేసేందుకు కొందరు ఇప్పటి నుండే సిద్దం అవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు కు చెందిన వాళ్లం అంటూ కొందరు తమ నాయకుడి పేరు పెట్టి ఆయన్ను ఇష్టానుసారంగా చూపించడం ఏంటీ అంటూ వారు ఆగ్రహం చేసే అవకాశం ఉంది. మన్యం వీరుడు అల్లూరి రియల్ స్టోరీ తీస్తే తాము అడ్డు పడం. కాని అల్లూరి సీతారామ రాజు పేరు వాడుతూ ఆయనకు సంబంధం లేని కథను తీసుకు వస్తా అంటే ఎలా ఒప్పుకుంటాం అంటూ వారు విమర్శలు చేసే అవకాశం ఉంది. తమ మనో భావాలు దెబ్బ తినే విధంగా తమ మన్యం వీరుడు అల్లూరిని చూపించారంటూ అప్పటికి వారు ఆరోపించినా ఆశ్చర్యం లేదు.
ఇక కోండ్రు బిడ్డ కొమురం భీమ్ విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. కొమురం భీమ్ పెళ్లిలు ఇతర విషయాల గురించి జక్కన్న చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కనుక తమ కొమురం భీమ్ గురించి తప్పుడు సమాచారంను చూపించారంటూ వారు ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తారు. తమ మనోభావాలను దెబ్బ తిసేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తారనే టాక్ వినిపిస్తుంది. దాంతో విడుదల సమయంలో ఇలాంటి చిన్న చిన్న వివాదాలు జక్కన్న ఎదుర్కోవాల్సి రావచ్చు అంటున్నారు.
ఆ సమయంలో కాస్త సంయమనంతో రాజమౌళి వ్యవహరించి వివాదాలను పరిష్కరించే అవకాశం ఉందా.. లేదంటే సినిమా విడుదల విషయంలో రచ్చ జరిగేనా అనేది చూడాలి. ఇక ఈ సినిమా లో అల్లూరి పాత్రను రామ్ చరణ్ పోషిస్తూ ఉండగా.. కొమురం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్న విషయం తెల్సిందే. చరిత్రలో అల్లూరి మరియు కొమురం భీమ్ కలిసింది లేదు. కాని ఈ సినిమా లో మొదట శత్రువులుగా ఢీ అంటే ఢీ అంటూ పోరాటం చేస్తారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పోయి శత్రువుల మీద యుద్దం చేస్తారు. అలా ఈ సినిమా లో ఇద్దరు రియల్ హీరోల పాత్రల తో పూర్తి కల్పిత కథలతో స్టార్ హీరోలతో చూపించేందుకు జక్కన్న సిద్దం అయ్యాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ఈ అక్టోబర్ లో విడుదల అవ్వాల్సి ఉంది. కరోనా ఏమైనా వాయిదా వేయించేనా అనేది తెలియాల్సి ఉంది.