Begin typing your search above and press return to search.
కొమురం భీమ్ కు ముస్లిం టోపీ పెట్టడంపై RRR రచయిత వివరణ..!
By: Tupaki Desk | 22 July 2021 9:33 AM GMTదర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ వంటి ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ తీసుకుని కల్పిత కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం మొదట నుంచీ చెబుతూనే ఉన్నారు. ఇందులో భీమ్ గా ఎన్టీఆర్.. రామరాజు గా రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ లుక్ ని రివీల్ చేసినప్పుడు కొమురం భీమ్ కు ముస్లిం టోపీ ధరించినట్లు చూపించడంపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆదివాసీల నుంచి ఎంపీల వరకు అందరూ 'ఆర్ ఆర్ ఆర్' దర్శకుడు రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు.
ముస్లిం పాలకులపై పోరాడి వారి చేతిలోనే చంపబడ్డ కొమురం భీమ్ ని.. వారి వేషదారణలో చూపించడం తగదని విమర్శలు చేశారు. బీజేపీ నాయకుడు బండి సంజయ్ లాంటి వారు 'RRR' చిత్రంలో ఆ సన్నివేశాలని తొలగించకుండా రిలీజ్ చేస్తే బరిశెలతో కొట్టి చంపుతామని.. థియేటర్స్ తగల బెడతామని.. రాజమౌళి కి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మొలదారం లేనోడికే నువ్వు భయపడితే.. మొలదారం ఉన్నోల్లమి మేమంత చేయాలి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంతవరకు 'ఆర్.ఆర్.ఆర్' బృందం దీనిపై స్పందించలేదు. తాజాగా రాజమౌళి తండ్రి, రచయిత కె.వి. విజయేంద్రప్రసాద్ ఓ ఆంగ్ల మీడియాతో దీని గురించి మాట్లాడారు.
కొమరం భీమ్ పాత్రకు ముస్లిం మత సాంప్రదాయ టోపీని పెట్టడం గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''అలా చూపించడం వెనుక ఖచ్చితమైన కారణం ఉంది. కథలో అతన్ని పట్టుకోవాలని హైదరాబాద్ నిజాం వెంటాడుతుంటాడు. కాబట్టి అతను నిజాం పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే వారిని మభ్యపెట్టడానికి ముస్లిం యువకుడిగా వేషం మార్చుకున్నాడు'' అని వివరణ ఇచ్చారు. అంతేకాదు RRR లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ ను పోలీస్ గా చూపించడానికి ఓ కారణం ఉందని.. అది ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తుందని రచయిత తెలిపారు.
'ఆర్ ఆర్ ఆర్' చిత్రం 'బాహుబలి' లాంటిది కాదని.. ఇద్దరు హీరోలతో సినిమా చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్న తర్వాత కథ రాశామని.. అలానే ఎన్టీఆర్ - చరణ్ ఇమేజ్ ను అంచనాలను దృష్టిలో పెట్టుకున్నామని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. కాగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ట్రిపుల్ ఆర్ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా.. ప్రస్తుతం ఓ ప్రమోషన్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు రాజమౌళి అండ్ టీమ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తున్నారు. అదే సమయంలో పెండింగ్ వర్క్ చిత్రీకరణ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వినూత్నమైన రీతిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్లు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇక రీసెంటుగా వచ్చిన 'రోర్ ఆఫ్ ఆర్.ఆర్.ఆర్' వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.
ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంతో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ - శ్రీయా - సముద్రఖని - అలిసన్ డూడీ - రే స్టీవెన్ సన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.