Begin typing your search above and press return to search.

RRR పేరిట మరో రికార్డ్..!

By:  Tupaki Desk   |   9 April 2022 2:30 AM GMT
RRR పేరిట మరో రికార్డ్..!
X
ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ''ఆర్.ఆర్.ఆర్'' సినిమా అనుకున్నట్టే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబడుతూ.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా.. రెండు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా మూడో వారంలో అడుగుపెట్టింది.

RRR సినిమా రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా 950 కోట్ల గ్రాస్ మార్క్ అందుకొని 500 కోట్ల షేర్ ను అధిగమించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్ లో 189 కోట్ల గ్రాస్ రాబట్టగా.. దేశీయ వసూళ్ళు 761 కోట్లుగా ఉన్నాయి. వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ షేర్ 520 కోట్లుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్) ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన.. 'బాహుబలి 2' రికార్డును పది రోజుల్లోనే బ్రేక్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు 250 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతోంది. నైజాం ఏరియాలో ఇప్పటికే 100 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది.

ఏపీ+తెలంగాణ రాష్ట్రాల్లో సెకండ్ వీక్ లో RRR సినిమా 61.11 కోట్లు షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటిదాకా 40.28 కోట్లతో 'బాహుబలి 2' పేరిట ఉన్న రికార్డ్ బ్రేక్ అయింది. ఇక నార్త్ ఇండియాలో 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి కరోనా పాండమిక్ తర్వాత ఈ మార్క్ అందుకున్న రెండో సినిమాగా నిలిచింది. గురువారం హిందీలో ఈ చిత్రం 5 కోట్లు రాబట్టింది.

అయితే డొమెస్టిక్ లో 'ఆర్.ఆర్.ఆర్' మూవీ చాలా ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవాల్సి ఉంది. ఈ వారంలో ఎలా ఉంటాయనే దానిపై కలెక్షన్స్ ఆధారపడి ఉంటుంది. వచ్చే వారంలో 'బీస్ట్' 'కేజీయఫ్ 2' వంటి భారీ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి.

* ప్రపంచ వ్యాప్తంగా గా RRR సినిమా 14 రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే... (ట్రేడ్ నివేదికల ప్రకారం)

నైజాం – 102.85 కోట్లు
సీడెడ్ – 42.40 కోట్లు
యూఏ – 31.96 కోట్లు
నెల్లూరు – 8.50 కోట్లు
గుంటూరు – 16.75 కోట్లు
కృష్ణా – 13.35 కోట్లు
వెస్ట్ – 12.07 కోట్లు
ఈస్ట్ – 14.50 కోట్లు
*AP/TS మొత్తం - 242.38 కోట్లు (345 కోట్ల గ్రాస్)

కర్ణాటక - 40 కోట్లు (75 కోట్ల గ్రాస్)
తమిళనాడు - 37.5 కోట్లు (65 కోట్లు గ్రాస్)
కేరళ - 9.8 కోట్లు (24 కోట్ల గ్రాస్)
నార్త్ ఇండియా - 104 కోట్లు (248 కోట్ల గ్రాస్)
ఓవర్సీస్ - 87 కోట్లు (189 కోట్లు)
*మొత్తం (వరల్డ్ వైడ్) - 520.68 కోట్లు (950 కోట్ల గ్రాస్)

'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమురం భీమ్‌ గా ఎన్టీఆర్ నటించారు. అజయ్ దేవగన్ - ఆలియా భట్‌ - ఒలివియా మోరిస్‌ - శ్రియా - సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.