Begin typing your search above and press return to search.
ఆర్ఆర్ఆర్ బ్యూటీకి అవన్నీ తినిపించారు.. జాగ్రత్తే కదా?
By: Tupaki Desk | 30 Aug 2021 3:28 AM GMTఊరు కాని ఊరు. రాష్ట్రం కాని రాష్ట్రం. ఆ మాటకు వస్తే దేశం కాని దేశం. గతం సంగతి పక్కన పెట్టి వర్తమానంలోకి వస్తే.. ఒక ఫారినర్ స్ట్రీట్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తుందా? అంటే నో చెప్పేస్తారు. అసలే కరోనా కాలం.. ఓవైపు అమెరికాతో సహా పలు దేశాల్లో థర్డ్ వేవ్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ.. ఇప్పుడు సాహసాలు చేయటానికి చాలానే గుండె ధైర్యం కావాలి. చూస్తుంటే.. అలాంటివి తనకు టన్నుల కొద్దీ ఉన్నాయన్న భావన కలిగేలా ఆర్ఆర్ఆర్ బ్యూటీ హైదరాబాద్ వీధుల్లో పెద్ద సాహసమే చేసింది.
జక్కన్న చెక్కుతున్న తాజా శిల్పం ఆర్ఆర్ఆర్. ఇందులో స్వాతంత్య్రంకోసం ధైర్య సాహసాలతో పోరాడే కొమురం భీమ్ తో ప్రేమలో పడే బ్రిటిష్ వనిత పాత్రను ఆమె పోషిస్తున్నారు. ఆమె పేరు ఒలీవియా. తాజాగా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆమెకు.. ఇక్కడి పరిసరాలు.. చిరుతిండ్లు అన్ని కొత్తగా అనిపించటంతో.. తనకు సిటీ చూడాలని ఉందని అడగటంతో.. అందుకు కాస్ట్యూమ్ డిజైనర్ అనురెడ్డి ఆమెకు హైదరాబాద్ చూపించే బాధ్యతను తీసుకున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం వారు హైటెక్ సిటీ వద్దనున్న శిల్పారామానికి వెళ్లారు. అక్కడి అందాల్ని చూసి హ్యాపీగా ఫీలయ్యారు. అక్కడి గ్రామీణ వాతావరణం.. అక్కడి షాపింగ్ ఆమెను బాగా ఎంటర్ టైన్ చేసింది. అనంతరం వీధుల్లో చిరుతిళ్లు తిన్నారు. పనిలో పనిగా పానీపూరీ కూడా లాగించేసినట్లు.. ఒలీవియా పెట్టిన ట్విట్ చెప్పేస్తోంది.
కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు తిండిలో ప్రయోగాలు చేయటం మంచిదే. కానీ.. వెనుకా ముందు చూసుకోకుండా చేస్తే.. ఇబ్బందుల ప్రమాదం ఉంటుంది. తాజాగా పానీ పూరీ తినేసినట్లుగా ఓలీవియా చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ.. తిప్పటం వరకు ఓకే.. విదేశీయులకు లోకల్ ఫుడ్ ను ఇప్పించారు సరే.. ఏదైనా తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారా? లేదా? అన్నదే అసలు ప్రశ్న. ఏ చిన్న తేడా వచ్చినా.. ఒకట్రెండు వారాలు దెబ్బపడే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించి.. అందుకు తగ్గట్లు ప్రిపరేషన్ చేసుకుంటే మంచిదన్నది గుర్తిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.