Begin typing your search above and press return to search.

RRR: రామ్ కు భీమ్ సర్ప్రైజ్..!

By:  Tupaki Desk   |   7 Dec 2021 11:30 AM GMT
RRR: రామ్ కు భీమ్ సర్ప్రైజ్..!
X
దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ''ఆర్.ఆర్.ఆర్'' సినిమాపై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న RRR చిత్రాన్ని 2022, జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. డిసెంబర్ 9న ట్రైలర్ ను లాంచ్ చేస్తున్నారు.

'ఆర్.ఆర్.ఆర్' ట్రైలర్ ను సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. అయితే అంతకంటే ముందే అభిమానుల్లో జోష్ నింపడానికి చిత్ర బృందం స్పెషల్ పోస్టర్స్ - ట్రైలర్ టీజ్ లను వదులుతున్నారు.

ఇప్పటికే కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ - అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ ల కొత్త పోస్టర్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈక్రమంలో ట్రైలర్ లో రామరాజు పాత్రకు సంబంధించిన సన్నివేశాన్ని తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్’ అంటూ చరణ్ ని ట్యాగ్ చేశారు ఎన్టీఆర్.

ఇందులో పోలీస్ గెటప్ లో ఉన్న రామ్ చరణ్ మంటల్లోంచి నడుచుకుంటూ రావడం చూడవచ్చు. బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్ అనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో వచ్చిన ఈ చిన్న వీడియో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక భీమ్ కు సంబంధించిన ట్రైలర్ టీజ్ ని చరణ్ విడుదల చేయనున్నారు.

కాగా, మరో రెండు రోజుల్లో రాబోతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రైలర్ లో ఎన్టీఆర్ - చరణ్ ల పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో.. రాజమౌళి విజువల్ ట్రీట్ ఎలా ఉంటుందో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ట్రైలర్ తో సినిమాపై రెట్టింపు హైపు తెచ్చేందుకు జక్కన్న టీమ్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది.

RRR చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.