Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్'లో ఎన్టీఆర్ టోపీని తొలగించడం సాధ్యమేనా...?

By:  Tupaki Desk   |   28 Oct 2020 5:30 AM GMT
ఆర్.ఆర్.ఆర్లో ఎన్టీఆర్ టోపీని తొలగించడం సాధ్యమేనా...?
X
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'(రౌద్రం రణం రుధిరం) పై వివాదం రేగిన సంగతి తెలిసిందే. 'కొమురం భీమ్‌' గా ఎన్టీఆర్.. 'అల్లూరి సీతారామరాజు'గా రామ్‌ చరణ్‌ నటిస్తున్న ఈ సినిమా నుంచి ఓటీవలె 'రామరాజు ఫర్ భీమ్' పేరుతో టీజర్ రిలీజయింది. గోండ్రు బెబ్బులి కొమురం భీమ్‌ అంటూ ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర తీరుతెన్నులని పరిచయం చేశారు. ఈ టీజర్ లో ఎన్టీఆర్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేసిన రాజమౌళి.. చివర్లలో తారక్ ని ఓ మతవిశ్వాసాలకు సంబంధించిన టోపీ ధరించిన యువకుడిగా చూపించడంపై ఓ వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆదివాసులు నుంచి వ్యతిరేకతగా ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు బీజేపీ ఎంపీ వార్నింగ్ ఇచ్చే వరకు చేరింది.

ఆదిలాబాద్‌ బీజేపీ ఎంపీ సోయం బాపురావు దీనిపై స్పందిస్తూ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' సినిమాలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని దర్శకుడు రాజమౌళిని హెచ్చరించారు. నిజాం వ్యకులతో పోరాటం చేసిన కొమరం భీమ్‌ కు ఇతర మతాలతో సంబంధం పెట్టి టోపీలు పెట్టడం సరైంది కాదని.. కలెక్షన్ల కోసం పాత్రను వక్రీకరిస్తే బాగోదని.. టోపీ ధరించి ఉన్న సన్నివేశాలని తొలగించాలని.. లేకపోతే సినిమా థియేటర్లపై దాడి చేసే అవకాశం ఉదని ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనిపై రాజమౌళి కానీ ఆర్.ఆర్.ఆర్ బృందం కానీ ఇంతవరకు స్పందించలేదు. ఆదివాసుల నుంచి ఎన్టీఆర్ టోపీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాజమౌళి ఆ సన్నివేశాలను తొలిగిస్తాడా అని అందరూ ఆలోచిస్తున్నారు.

వాస్తవానికి రాజమౌళి మొదటి నుంచి ఇది ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ తో తీస్తున్న కల్పిత కథ అని చెప్తూ వస్తున్నాడు. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ కూడా పూర్తయింది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ టోపీ తీసేయడం కుదిరేపని కాదని తెలుస్తోంది. అందులోనూ ఎన్టీఆర్ అజ్ఞాతవాసంలో ఎక్కువ భాగం ఈ గెటప్ లోనే ఉంటాడని టాక్. దీనిని బట్టి చూస్తే ఈ టోపీ సన్నివేశాలను మార్చడం కష్టమే అని తెలుస్తోంది. 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ మాత్రం ఈ చిత్రంలో కొమురం భీమ్ ను ముస్లింగా చూపించడం లేదని.. సినిమా విడుదలైన తరువాత అందరికీ అర్థం అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో కొమరం భీమ్‌ టోపీ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.