Begin typing your search above and press return to search.

వీడియో : ఆర్ఆర్‌ఆర్ భీమ్‌ అన్ ట్రిమ్డ్‌ వండర్‌ ఇంట్రో షాట్‌

By:  Tupaki Desk   |   15 Sep 2022 8:30 AM GMT
వీడియో : ఆర్ఆర్‌ఆర్ భీమ్‌ అన్ ట్రిమ్డ్‌ వండర్‌ ఇంట్రో షాట్‌
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమాలోని ప్రతి సన్నివేశంలోని ప్రతి షాట్‌ కూడా విజువల్‌ వండర్ అనడంలో సందేహం లేదు. సినిమా మొత్తం విజువల్‌ వండర్ అవ్వడం వల్లే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి. నెట్‌ ఫ్లిక్స్ లో హాలీవుడ్ సినిమాల రేంజ్ లో పదుల కొద్ది దేశాల్లో ట్రెండ్‌ అయ్యింది.

సినిమాలోని అన్ని అద్భుతమైన షాట్స్ అనడంలో సందేహం లేదు. అద్భుతాల్లోకి అత్యద్భుతం అన్నట్లుగా ఈ షాట్ నిలుస్తుందని అభిమానులు ఫీల్ అయ్యేలా సినిమాకు వీఎఫ్‌ఎక్స్ ను అందించిన శ్రీనివాస్ మోహన్ ఈ వీడియోను షేర్‌ చేశారు. సినిమాలోని కొమురం భీమ్ యొక్క పాత్ర ఇంట్రోకి సంబంధించిన ఈ షాట్‌ జక్కన్న యొక్క ప్రతిభకు అద్దం పడుతుంది.

జక్కన్న ఎంతగా ఇమాజిన్ చేసినా కూడా అందుకు తగ్గట్లుగా గ్రాఫిక్స్ ఉంటేనే ఆ షాట్‌ వండర్ అన్నట్లుగా నిలుస్తుంది.

దీన్ని అద్భుతంగా డిజైన్ చేసిన వీఎఫ్‌ఎక్స్ టీమ్‌ ని ఎంతగా అభినందించినా తక్కువే అంటూ ఎన్టీఆర్‌ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఈ వీడియోకు తెగ ఫిదా అవుతున్నారు.

ఎన్టీఆర్‌ ఇంట్రో లో తూనిగను చూపిస్తూ మొదట మిర్రర్ వ్యూ చూపించి మిర్రర్‌ లో ఉన్నది రియల్‌ అన్నట్లుగా ప్రేక్షకులను ఒకింత సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విధంగా ఈ షాట్ ఉంది. ఇది అత్యంత రేర్‌ షాట్‌ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భీమ్‌ అన్ ట్రిమ్డ్‌ ఇంట్రో షాట్‌ అంటూ విడుదల అయిన ఈ వీడియో బిట్‌ కి మిలియన్స్ లో వ్యూస్ దక్కుతున్నాయి. లక్షల్లో లైక్స్ షేర్స్‌ దక్కుతున్నాయి. సినిమా విడుదల అయ్యి ఇన్నాళ్లు అయినా కూడా ఈ స్థాయి లో రెస్పాన్స్ ఉంది అంటే ఇలాంటి బిట్స్ వల్లే అనడంలో సందేహం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.