Begin typing your search above and press return to search.

అమెరికాలో తేలాల్సిన అస‌లు లెక్క అదీ బాస్!

By:  Tupaki Desk   |   5 May 2022 2:30 AM GMT
అమెరికాలో తేలాల్సిన అస‌లు లెక్క అదీ బాస్!
X
ఓవ‌ర్సీస్ అమెరికా తెలుగు సినిమాకు అతి పెద్ద మార్కెట్. స్టార్ హీరోల చిత్రాలు అమెరికాలో భారీ ఎత్తున‌ రిలీజ్ అవుతుంటాయి. కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ని ఒక్క అమెరికా మార్కెట్ నుంచే రాబ‌డుతుంటాయి. చిన్న సినిమా సైతం పాజిటివ్ టాక్ ద‌క్కిచుకుందంటే? మంచి వ‌సూళ్లు సాధించ‌డం లో యూఎస్ మార్కెట్ కీల‌క భూమిక పోషిస్తుంది. కంటెంట్ బేస్డ్ చిత్రాల‌కు అక్క‌డ మంచి అద‌ర‌ణ ల‌భిస్తుంది. అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో తెలుగు ప్రేక్ష‌కులు అధిక సంఖ్య‌లో స్థిర‌ప‌డ‌టంతోనే అక్క‌డ మార్కెట్ కి కీల‌కంగా మారింది.

అందుకే అగ్ర హీరోల చిత్రాల వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ని ఒక్క యూఎస్ మార్కెట్ నుంచే రాబ‌డుతుంటాయి. దాదాపు అన్ని ఏరియాల్లో స్టార్ హీరోల చిత్రాలు భారీ ఎత్తున రిలీజ్ అవుతుంటాయి. 'బాహుబ‌లి' లాంటి చిత్రం గ్లోబ‌ల్ సినిమాగా ఫేమ‌స్ అయిందంటే ఇత‌ర దేశాల‌కంటే ముందుగా పాన్ ఇండియా రిలీజ్ తో పాటు అమెరికాలో రిలీజ్ అవ్వ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా చెప్పొచ్చు.

మ‌రి ఇప్ప‌టివ‌ర‌కూ అమెరికాలో ఎక్కువ లోకేష‌న్స్ లో రిలీజ్ అయిన తెలుగు చిత్రాల గురించి ఓ లుక్ ఏస్తే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలుస్తున్నాయి. టాప్ -5 జాబితాలో ఈ తెలుగులు సినిమాలున్నాయి. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'ఆర్ ఆర్ ఆర్' ఆ వ‌రుస‌లో నెంబ‌ర్ -1 స్థానంలో నిలిచింది. ఈ సినిమా మొత్తం 1165 లోకేష‌న్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది.

అంత‌కు ముందు ఈ రికార్డు 'అజ్ఞాతవాసి' పేరిట ఉండేది. నాలుగేళ్ల క్రితం 'అజ్ఞాత‌వాసి' అక్క‌డ ఏకంగా 515 లోకేష‌న్ల‌లో రిలీజ్ అయింది. ఆ రికార్డు ని 'రాధేశ్యామ్' బ్రేక్ చేసింది. ఈ సినిమా మొత్తం 776 అమెరికా లోకేష‌న్ల‌లో రిలీజ్ అయింది. ప్ర‌భాస్ అప్ప‌టికే పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు కాబ‌ట్టి భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న తొలి తెలుగు ల‌సినిమాగా ఖ్యాతికెక్కింది.

అయితే ఆ రికార్డును 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ తో చెరిగిపోయింది. ఇక 'బాహుబ‌లి -2' ..452 లోకేష‌న్ల‌లో రిలీజ్ అవ్వ‌గా...ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన 'భీమ్లా నాయ‌క్'- 382 లోకేష‌న్ల‌లో రిలీజ్ అయింది. ఇక మే 12 న సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'స‌ర్కారు వారి పాట' వాట‌న్నింటిని చెరిపేసి క‌నీసం రెండ‌వ స్థానంలో నిలుస్తుంద‌ని అంచ‌నాలుండేవి.

కానీ సూప‌ర్ స్టార్ అంత రిస్క్ తీసుకోలేదు. ఈ చిత్రాన్ని కేవ‌లం 603 లొకేష‌న్ల‌కే ప‌రిమితం చేసారు. అయితే ఇన్ని లోకేష‌న్లల‌లో రిలీజ్ అవ్వ‌డం మ‌హేష్ కెరీర్ లోనే ఇది తొలిసారి. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌హేష్ సినిమాలు అమెరికాలో ఈ స్థాయి లోకేష‌న్స్ లో రిలీజ్ కాలేదు. ఆ రకంగా మ‌హేష్ కి ఇది కొత్త ఎక్స్ పీరియ‌న్స్ అని చెప్పాలి.

ఓసారి ఆర్డ‌ర్ ప్ర‌కారం చూస్తే 'ఆర్ ఆర్ ఆర్'- 1165 లోకేష‌న్ల‌లో... 'రాధేశ్యామ్'- 776 లో కేష‌న్లలో..' స‌ర్కారువారి పాట'- 603 లొకేష‌న్ల‌లో.. 'అజ్ఞాత‌వాసి'- 515 లొకేష‌న్ల‌లో..' బాహుబ‌లి' -2.. 425 లొకేష‌న్లో.. 'భీమ్లా నాయ‌క్' - 382 లొకేష‌న్లో రిలీజ్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఏ సినిమా ఎన్ని లొకేష‌న్ల‌లో రిలీజ్ అయింది అన్న‌ది మ్యాట‌ర్ కాదు. ఏ సినిమా భారీ వ‌సూళ్ల‌ని సాధించింది అన్న‌ది బాక్సాఫీస్ లెక్క‌. ఆ లెక్క‌ని మించిన లెక్క ఇంకేది ఇక్క‌డ క్యాలుక్యులేట్ కాదు అన్న‌ది గ్ర‌హించాలి. హీరోలు..నిర్మాత‌లు..ద‌ర్శ‌కులు నమ్మ సిద్దాంతం ఇదే.