Begin typing your search above and press return to search.
యుఎస్ బాక్సాఫీస్ వద్ద 'RRR' హల్ చల్
By: Tupaki Desk | 17 March 2022 11:02 AM GMTదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'RRR'. ఈ మూవీ రిలీజ్ కి సరిగ్గా వారం రోజులే మిగిలి వుంది. జనవరి 7న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ డేట్ మళ్లీ మారింది. సినిమా వాయిదా పడింది. అయినా సరే సినిమాపై వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అదే క్రేజ్. ఇది ఓన్లీ ఇండియా వ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్ లోనూ ఈ మూవీపై ఇదే క్రేజ్ కొనసాగుతూ పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
లేట్ అయినా సరే అదే జోరు.. అదే జోష్ ఈ మూవీపై అభిమానుల ప్రేమ కనిపిస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింటగ్స్ పరంగా యుఎస్ ప్రీమియర్స్ పరంగా రికార్డులు తిరగరాస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' మార్చి 25న విడుదలవుతున్న నేపథ్యంలో మేకర్స్ మళ్లీ ప్రమోషన్స్ ని ప్రారంభించేశారు. దేశ వ్యాప్త ప్రచారం కోసం ప్రధాన టీవీ ఛానల్స్ తో పాటు పేరున్న యూట్యూబ్ ఛానల్స్ ని కూడా లైన్ లో పెట్టేసి వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు 'ఆర్ ఆర్ ఆర్' టీమ్.
ఈ నెల 19న ఈ మూవీ కోసం కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయని, ఈ ఈవెంట్‌తో 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ పీక్స్ కి చేరబోతున్నాయని చెబుతున్నారు. ఈ ఈవెంట్ లో ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ హాజరయ్యే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతు కాకుండా కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుంటే ఈ మూవీ యుఎస్ లో భారీ స్థాయిలో విడుదలవుతూ రికార్డు సృష్టించబోతోంది. ఈ చిత్రాన్ని యుఎస్ లో సరిగమ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. అయితే ఈ చిత్రాన్ని 1150 స్క్రీన్ లలో విడుదల చేస్తుడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ భారతీయ చిత్రం యుఎస్ లో ఈ స్థాయిలో విడుదల కాలేదని, ఇదే మొట్టమొదటి సారి కావడంతో అభిమానులు, సినీ లవర్స్ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలోనే కాకుండా ఇంత వరకు ఏ ఇండియన్ ఫిల్మ్ యుఎస్ లో ఈ స్థాయిలో విడుదల అయిన దాఖలాలు లేకపోవడంతో ఇదొక సరికొత్త రికార్డ్ గా చెబుతున్నారు.
బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగానూ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గానూ నటించారు. కీలక పాత్రల్లో హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ నటించగా, ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరీస్, రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటించారు. ఇతర ప్రధాన పాత్రల్ని అజయ్ దేవగన్, సముద్ర ఖని పోషించారు.