Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్ : కాస్త ఆలస్యం అయినా సెంచరీ కొట్టారు

By:  Tupaki Desk   |   19 March 2022 7:39 AM GMT
ఆర్ఆర్ఆర్ : కాస్త ఆలస్యం అయినా సెంచరీ కొట్టారు
X
ఎన్టీఆర్.. రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్‌ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 25 వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి కొన్ని నెలల క్రితం కీరవాణి స్వరపరచిన నాటు నాటు అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ఆ పాట డాన్స్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళం మలయాళం మరియు కన్నడ భాషలలో కూడా నాటు నాటు పాట విడుదలయింది.

ప్రతి భాషలో కూడా పాట సూపర్ హిట్ టాక్‌ ను దక్కించుకుంది. అన్ని చోట్ల కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వేలాది మంది నాటు నాటు స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన నాట్ నాట్ సాంగ్ యూట్యూబ్ 100 మిలియన్ ల వ్యూస్‌ ను చేరింది.

కాస్త ఆలస్యమైనా కూడా సినిమా విడుదల సమయం లో 100 మిలియన్ల క్లబ్ లో ఈ పాట చేరడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ పాటని విడుదల చేయడం వల్ల తెలుగు వర్షన్‌ వంద మిలియన్ ల క్లబ్‌ లో చేరడం కాస్త లేట్ అయింది అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి నాటు సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ దక్కడంతో అభిమానులు మరియు చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం గా ఉన్నారు కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ను ఈ పాట మరింతగా కలిగించింది అంటూ ఎంతో మంది అభిమానులు మరియు ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. తాజాగా వంద మిలియన్ ల వ్యూస్‌ రావడంతో ఇదే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని నమ్మకంతో ఉన్నారు.

ఓవర్సీస్లో ఈ సినిమా ఇప్పటికే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసింది. అంతే కాకుండా అడ్వాన్స్ బుకింగ్ లతో సరి కొత్త రికార్డులను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు రంగం సిద్ధమైంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా విజువల్ వండర్ గా ఉంటుందట.

ఇటీవలే ఈ సినిమాకు పనిచేసిన ఒక టెక్నీషియన్ మాట్లాడుతూ ఈ సినిమా అద్భుతం.. ఖచ్చితంగా మూడు వేల కోట్ల వసూళ్లను రాబడుతుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. బాహుబలి 2 రికార్డును ఈ సినిమా కచ్చితంగా బ్రేక్ చేస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశాడు. అదే కనుక నిజం అయితే రాజమౌళి స్థాయి మరో వంద రెట్లు పెరగడం ఖాయం.