Begin typing your search above and press return to search.
RRR క్లైమాక్స్ బడ్జెట్.. అవాక్కవ్వాల్సిందే!
By: Tupaki Desk | 16 Jan 2020 6:05 AM GMTఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' ప్రస్తుతం సెట్స్ పై ఉన్న భారీ చిత్రాలలో ఒకటి. రామ్ చరణ్.. ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి చిత్రాలు భారీతనానికి కేరాఫ్ అడ్రెస్ అన్నట్టుగా ఉంటాయి. ఈ సినిమా బడ్జెట్ ను చూస్తే ఇది కూడా రాజమౌళి స్థాయిలోనే తెరకెక్కుతుందని మనకు అర్థం అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ బడ్జెట్ లో మెజారిటీ భాగం క్లైమాక్స్ చిత్రీకరణకే ఖర్చు పెడుతున్నారట.
ఈ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం దాదాపు రూ. 150 కోట్లు ఖర్చు చేశారని 'RRR' ఫిలింయూనిట్ కు సన్నిహితంగా ఉండేవారు వెల్లడించారు. క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్ అని.. అందుకే ఖర్చు గురించి ఆలోచించకుండా స్క్రీన్ పై ఎలా కనిపిస్తుందనే దానికి ప్రాధాన్యతనిచ్చారట. నిజానికి ఈ క్లైమాక్స్ బడ్జెట్ తో తెలుగులో స్టార్ హీరోల సినిమాను తెరకెక్కించవచ్చు. అలాంటిది ఒక్క క్లైమాక్స్ కోసమే ఖర్చు పెట్టారంటే రాజమౌళి ఏ రేంజ్ లో డిజైన్ చేసి ఉంటారో మనం ఊహించుకోవచ్చు.
ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరీస్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. 'RRR' ముందుగా ప్రకటించినట్టుగా జులై 30 వ తారీఖున రిలీజ్ అవుతుందని అంటున్నారు.