Begin typing your search above and press return to search.

నెట్టింట వైర‌ల్ అవుతున్న RRR కాన్సెప్ట్ పోస్ట‌ర్‌!

By:  Tupaki Desk   |   30 Jun 2022 12:30 PM GMT
నెట్టింట వైర‌ల్ అవుతున్న RRR కాన్సెప్ట్ పోస్ట‌ర్‌!
X
రాజ‌మౌళి 'RRR'తో ఇండియ‌న్ సినిమా స‌త్తాని మ‌రోసారి యావ‌త్ ప్ర‌పంచానికి చాటారు. ఇద్ద‌రు క్రేజీ స్టార్ హీరోలు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల తొలి కాంబినేష‌న్ లో రూపొందించిన ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ప్ర‌సంచ వ్యాప్తంగా విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టించింది. ఇండియ‌న్ సినిమా స‌త్తా ఏంటో యావ‌త్ ప్ర‌పంచానికి తెలియ‌జేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి విజ‌న్ ని వెండితెర‌పై ఆవిష్క‌రించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది.

ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే అత్యంత భారీ మూవీగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించింది. ఓటీటీలో విడుద‌లైన ఈ మూవీపై హాలీవుడ్ స్టార్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిస్తున్నారు. ఈ మూవీ ఓ అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ సెలెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్ జాబితాలో RRR నిలిచి అరుదైన ఘ‌న‌త‌ని సొంతం చేసుకుంది. ఇలా ఎంపికైన తొలి ఇండియన్ మూవీగా రికార్డుల కెక్కింది. ఇదిలా వుంటే ఈ మూవీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ల‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాలు ప్రేక్ష‌కుల్ని అబ్బుర ప‌రిచాయి.

ఈ గ్రాఫిక్స్ వ‌ర్క్ కి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియోల‌ని మేక‌ర్స్ ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ లో రామ్ చ‌ర‌ణ్ ని రామ‌రాజుగా.. రాముడిగా చూపించిన ఓ స‌న్నివేశానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ ని ఈ మూవీకి గ్రాఫిక్స్ ప‌ర్య‌వేక్ష‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన శ్రీ‌నివాస మోహ‌న‌న్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు. చ‌ర‌ణ్ కాషాయం ధ‌రించి.. చేతిలో విల్లుతో క‌నిపిస్తుండ‌గా వెన‌కాల లైటింగ్ విర‌జిమ్మిన తీరు అచ్చం శ్రీ‌రాముడేనా అనేలా చేసింది.

ఈ సీన్ కోసం రాజ‌మౌళి ఓ కాన్సెప్ట్ పోస్ట‌ర్ ని రెడీ చేయించార‌ట‌. ఆ పోస్ట్ ని కూడా శ్రీ‌నివాస మోహ‌న‌న్ రివీల్ చేశారు. ఆ పోస్ట‌ర్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఆ కాన్సెస్ట్ పోస్ట‌ర్ ని యాజిటీజ్ గా సినిమాలో రీక్రియేట్ చేసి వుంటే ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌లో లేచి పూన‌కాల‌తో ఊగిపోయేవారని తెలుస్తోంది. మ‌రింత ఫెరోషియ‌స్ గా కాన్సెప్ట్ పోస్ట‌ర్ క‌నిపిస్తోంది. అంత కాక‌పోయినా ఆ రేంజ్ కి ద‌గ్గ‌ర‌లోనే చ‌ర‌ణ్ ని క్లైమాక్స్ లో చూపించిన తీరు ద‌క్షిణాది వారినే కాకుండా ఉత్త‌రాది వారిని కూడా రోమాంచితుల్ని చేసింది.

విచిత్రం ఏంటంటే ఈ షాట్ లో రామ్ చ‌ర‌ణ్ ని చూసిన ద‌క్షిణాది వారంతా అల్లూరిని గుర్తు చేసుకుంటే ఉత్త‌రాది వారు మాత్రం శ్రీ‌రాముడిని గుర్తు చేసుకోవ‌డం విశేషం. అంత‌గా ఆ సీన్ వారిపై ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. శ్రీ‌రాముడు అంటూ నెట్టింట పోస్ట్ లు పెట్టి హ‌ల్ చ‌ల్ చేశారు. దీంతో ఈ సీన్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా రాజ‌మౌళి కాన్సెప్ట్ పోస్ట‌ర్ తో మ‌రోసారి వైర‌ల్ అవుతూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.