Begin typing your search above and press return to search.

జపాన్ లో RRR దూకుడు తగ్గలేదు..!

By:  Tupaki Desk   |   6 Jan 2023 2:30 AM GMT
జపాన్ లో RRR దూకుడు తగ్గలేదు..!
X
ఓ పక్క RRR సినిమాకు రాజమౌళి అండ్ టీం అవార్డుల మీద అవార్డులు తీసుకుంటుంటే మరో పక్క ఆర్.ఆర్.ఆర్ వసూళ్ల హంగామా కొనసాగుతూనే ఉంది. ట్రిపుల్ ఆర్ సినిమాని జపాన్ లో లాస్ట్ ఇయర్ అక్టోబర్ 21న రిలీజ్ చేశారు. రిలీజ్ టైం లో ఆర్.ఆర్.ఆర్ యాక్టర్స్ ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరితో కలిసి రాజమౌళి అక్కడ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు. ఈ ప్రమోషన్స్ వల్ల సినిమా గురించి జపాన్ అంతా సందడిగా మారింది. అక్కడ మీడియాకు మన వాళ్లు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా వైరల్ గా మారాయి.

ఇక జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ విధ్వంసం కొనసాగుతుంది. అక్కడ బాక్సాఫీస్ స్టేటస్ ను చెబుతూ ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలు తమ సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా వారు చెప్పిన దాని ప్రకారం ఆర్.ఆర్.ఆర్ సినిమాను ఇప్పటి వరకు జపాన్ లో 3,23,211 మంది చూశారని ఎనౌన్స్ చేశారు. జపాన్ లో ఉన్న 60 ప్రదేశాల్లో ఆర్.ఆర్.ఆర్ అద్భుతంగా ప్రదర్శించబడుతుందని ఆర్.ఆర్.ఆర్ టీం ఎనౌన్స్ చేసింది. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ అక్కడ ఇండియన్ సినిమాల రికార్డులు అన్నిటినీ బ్రేక్ చేసింది.

ఇక మీదట జపాన్ లో ఇండియన్ సినిమా రికార్డులు అన్ని ఆర్.ఆర్.ఆర్ పేరు మీద ఉంటాయి. ఈ సినిమా చేసిన రికార్డులను మాత్రమే బ్రేక్ చేయాల్సిన టార్గెట్ ఉంటుంది. అంతకుముందు బాహుబలి సినిమా కూడా జపాన్ లో విశేష ప్రేక్షకాదరణ పొందింది. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ముత్తు సినిమా రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేదు. కానీ ఆర్.ఆర్.ఆర్ మాత్రం ముత్తు సినిమా రికార్డ్ లను కూడా బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది.

ఆర్.ఆర్.ఆర్ సినిమా రాజమౌళి అద్భుత సృష్టి ఇంటర్నేషనల్ లెవల్ గా ప్రశంసలు అందుకుంటుంది. బాహుబలి సినిమాకు రానటువంటి గ్లోబల్ ఐడెంటిటీ రాజమౌళికి ఈ సినిమాతో వచ్చిందని చెప్పొచ్చు.

లేటెస్ట్ గా బెస్ట్ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్ సర్కిల్స్ నుంచి అవార్డ్ ను అందుకున్నారు రాజమౌళి. ఒక తెలుగు దర్శకుడిగా రాజమౌళికి ఇది చాలా గొప్ప అచీవ్ మెంట్ అని చెప్పొచ్చు. కానీ అక్కడ ఉంది రాజమౌళి కాబట్టి ఈ అవార్డ్ తో ఆగిపోయే ప్రసక్తే లేదని ఆడియన్స్ అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.