Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీ బెస్ట్ క్రూతో RRR
By: Tupaki Desk | 12 Nov 2018 4:59 AM GMTప్రతిష్ఠాత్మక RRR ఈ ఆదివారం 11.11.11 ముహూర్తాన ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లోని భారీ సెట్స్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ఇండస్ట్రీ దిగ్గజాలంతా పాల్గొని సందడి చేశారు. ఈ చిత్రాన్ని డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దానయ్య డి.వి.వి నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా 2020లో రిలీజ్ కానుంది.
RRR కోసం ఇండస్ట్రీ బెస్ట్ టెక్నీషియన్లను రాజమౌళి & టీమ్ ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే క్షణం తీరిక లేకుండా వరుసగా భారీ చిత్రాలకు మాటలు అందిస్తున్న బుర్రా సాయిమాధవ్ మాటలు రాస్తున్నారు. ఆయనతో కలిసి కర్కీ అనే రచయిత పని చేస్తున్నారు. బాహుబలి కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కి కాస్ట్యూమ్స్ రూపకల్పన చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా కుదిరారు. ఈగ - బాహుబలి చిత్రాలకు పని చేసిన వి.శ్రీనివాస్ మోహన్ వి.ఎఫ్.ఎక్స్ సూపర్ విజన్ చేస్తుంటే - బాహుబలి సంగీతం దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నేషనల్ లెవల్ ట్యాలెంట్ సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ అదనపు బలం. బాహుబలి ఛాయాగ్రాహకుడు - రాజమౌళి ఆస్థాన విధ్వాంసుడు అయిన కె.కె.సెంథిల్ కుమార్ మెగా మూవీకి పని చేయడం మరో పెద్ద బలం. నంది గ్రహీత - స్టార్ రైటర్ వి.విజయేంద్రప్రసాద్ కథ అందించగా - రాజమౌళి స్క్రీన్ ప్లే - దర్శకత్వం చేపట్టి ప్రాజెక్టును ఇంటర్నేషనల్ స్టాండార్డ్ కి తీసుకెళుతున్నారు. రాజమౌళి - శ్రీనివాసన్ వంటి వారు జాతీయ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే.
నిర్మాత దానయ్య డి.వి.వి మాట్లాడుతూ - ``మోస్ట్ వెయిటెడ్ టాలీవుడ్ చిత్రాన్ని మా బ్యానర్ లో ది గ్రేట్ ఎస్.ఎస్.రాజమౌళి గారి దర్శకత్వంలో చేయడం ఓ డ్రీమ్ లాగా ఉంది. సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలున్నాయి. నందమూరి అభిమానులు - మెగాభిమానులు సినిమా కోసం ఎంత అతృతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. అందరి అంచనాలను మించేలా మేకింగ్ లో రాజీకి రాకుండా తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటేంత గొప్ప టెక్నికల్ వ్యాల్యూస్ తో సినిమాను భారీగా రూపొందిస్తాను. నవంబర్ 19 నుండి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఎన్టీఆర్ - చరణ్ కాంబినేషన్ లపై భారీ సెట్లో రెండు వారాల పాటు యాక్షన్ ఏపిసోడ్స్ తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే ఇతర నటీనటులు వివరాలను ప్రకటిస్తాం`` అని తెలిపారు.